హైదరాబాద్:
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై
నమ్మకం లేకనే తెలుగుదేశం పార్టీ
నాయకులు తమ పార్టీ అధ్యక్షుడు
వైయస్ జగన్ వైపు వస్తున్నారని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు అన్నారు. వల్లభనేని
వంశీ యాదృచ్ఛికంగా జగన్ను కలిస్తే
చంద్రబాబు ఎందుకంత ఉలికి పడుతున్నారని ఆయన
శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోతుందని ఆయన అన్నారు. ఉప
ఎన్నికల కన్నా ముందే రాష్ట్రంలో
కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన
జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో
మధ్యంతర ఎన్నికలు ఖాయమని, 2014 లోపే రాష్ట్రంలో ఎన్నికలు
వస్తాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత అంబటి రాంబాబు
అన్నారు. ఉప ఎన్నికల తర్వాత
ప్రభుత్వం కుప్ప కూలడం ఖాయమని
ఆయన విజయవాడలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు
అంతటి నీచుడు మరొకరు లేరని ఆయన వ్యాఖ్యానించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జలీల్ ఖాన్
ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు పార్టీలో
చేరారు.
తమ పార్టీకి ప్రజల నుంచి అనూహ్యమైన
మద్దతు లభిస్తోందని మాజీ మంత్రి, వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయి ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో పడ్డాయని ఆయన
ఆయన ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో అన్నారు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా
వైయస్సార్ కాంగ్రెసుకున ప్రజల అండ ఉంటుందని
ఆయన అన్నారు. వంగవీటి రాధాకృష్ణ రావడం సంతోషంగా ఉందని,
రాధా రాక వల్ల తమ
పార్టీ కచ్చితంగా బలపడుతుందని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment