హైదరాబాద్:
మద్దెలచెర్వు సూరి హత్య చేసేవరకు
భాను కిరణ్ పేరు బయటి
ప్రపంచానికి పెద్దగా తెలియదు. మద్దెలచెర్వు సూరి హత్యానంతరం పారిపోయిన
తర్వాత అతని నేరచరిత్రపై దృష్టి
పడింది. నిజానికి, అతని నేరచరిత్ర 2002 నుంచే
ప్రారంభమైందని అంటారు. అతనిపై మొత్తం 15 కేసులు నమోదైనట్లు సిఐడి అదనపు డిజి
రమణమూర్తి చెప్పారు. ఇందులో 9 కేసులను సిఐడి విచారిస్తోందని, మరో
నాలుగు కేసులను హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. భాను
కిరణ్ను మీడియా ముందు
ప్రవేశపెట్టినప్పుడు ఆయన ఈ విషయాలు
చెప్పారు.
అనంతపురం
జిల్లాలోని ధర్మవరం పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్నప్పటి నుంచి అతని దృష్టి
ఇతరేతర కార్యకలాపాలపై మళ్లినట్లు చెబుతారు. ధర్మవరంలో భూముల సెటిల్మెంట్లు కూడా
చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సికింద్రాబాదులోని రాంగోపాల్పేట పోలీసు స్టేషన్
పరిధిలో టాస్క్పోర్సు పోలీసులు భాను కిరణ్ను
సికింద్రాబాదులో ఓ పారిశ్రామికవేత్తకు రివాల్వర్ అమ్మడానికి
ప్రయత్నిస్తుండగా అరెస్టు చేశారు. అప్పుడు అరెస్టయిన పది మందిలో భానుతో
పాటు మంగలి కృష్ణ కూడా
ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
మరో కేసు హైదరాబాదులోని సైఫాబాద్
పోలీసు స్టేషనులో నమోదైంది. ఓ కంపెనీ డీల్
విషయంలో భాను కిరణ్ గ్యాంగ్
జోక్యం చేసుకుని ఓ కంపెనీ యజమానిని
బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డీల్ కొనసాగేలా భాను
చేశాడు. ఈ కేసులో పోలీసులు
12 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. 2009లో అక్రమాయుధాల కేసులో
సికింద్రాబాద్ బేగంపేట పోలీసులు భాను కిరణ్ను
పట్టుకున్నారు. కూకట్పల్లి భూకబ్జా
కేసులో 2010లో పోలీసులు భాను
కిరణ్ను అరెస్టు చేశారు.
జ్యోత్స్న అనే మహిళకు చెందిన
భూమిని భాను కిరణ్ గ్యాంగ్
నకిలీ పత్రాలతో కబ్జా చేయడానికి ప్రయత్నించాడని
ఆరోపణలున్నాయి.
విజయవాడ
బాలాజీ ప్యాకేజింగ్ కేసు అందరికీ తెలిసిందే.
కుటుంబ తగాదాల్లో తలదూర్చి భాను గ్యాంగ్ కంపెనీనే
చేజిక్కించుకునే ప్రయత్నం చేసిందని ఆరోపణలు వచ్చాయి. తన మిత్రుడు ప్రదీప్
రెడ్డి సహకారంతో భాను ఈ కుట్ర
చేసినట్లు ఆరోపణలున్నాయి. 2010లో బంజారాహిల్స్లో
గన్ లైసెన్స్ కేసు ఉన్నట్లు చెబుతారు.
తూపాకులు, రివాల్వర్లు అక్రమంగా సరఫార చేసినట్లు కూడా
ఆరోపణలున్నాయి. ఈ సమయంలో 8 మందిపై
కేసు నమోదు చేశారు.
ఖమ్మం
జిల్లాలో తప్పుడు పత్రాలతో గన్ లైసెన్స్ తీసుకున్నట్లు
కూడా భాను కిరణ్పై
ఆరోపణలు వచ్చాయి. 2011లో బేగంపేటలో ఓ
పారిశ్రామికవేత్తను బెదిరించిన కేసులో 12 మందిని అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వద్ద భూవివాదం కూడా
ఉంది. ఈ వివాదంలో భాను
కిరణ్ 8 ఎకరాల భూమిని, నాలుగు
ప్లాట్లను కొట్టేసినట్లు చెబుతారు. ఇక, షాలిజమార్ కంపెనీ
యజమానిని బెదిరించడం, నిర్మాతలు సింగనమల రమేష్, సి కళ్యాణ్లతో
కలిసి సెటిల్మెంట్లు చేయడం వంటివి మీడియాలో
విస్తృతంగానే వచ్చాయి. మొత్తం మీద, భాను కిరణ్
సూరిని అడ్డం పెట్టుకుని చాలా
సెటిల్మెంట్లు, కార్యకలాపాలు సాగించినట్లు చెబుతారు.
0 comments:
Post a Comment