హైదరాబాద్:
జూనియర్ ఎన్టీఆర్ తీరు పట్ల బాబాయ్
నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు
తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో
పార్టీ విజయవాడ నాయకుడు వల్లభనేని వంశీ నడిరోడ్డు మీద
భేటీ కావడం వెనక జూనియర్
ఎన్టీఆర్ ఉన్నారనే వార్తలు వచ్చాయి. వాటిని బాలయ్య నమ్ముతున్నట్లే ఉంది. జూనియర్ ఎన్టీఆర్
వర్గానికి చెందిన నాయకులను ఎవరినీ సహించకూడదని, జూలు విదిలిస్తే పార్టీ
నుంచి పంపించి వేయాలని ఆయన పార్టీ అధ్యక్షుడు
నారా చంద్రబాబు నాయుడికి సూచించినట్లు చెబుతున్నారు.
తండ్రి
నందమూరి హరికృష్ణ ప్రోద్బలంతో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో చిచ్చు పెడుతున్నారని బాలకృష్ణ భావిస్తున్నట్లు చెబుతున్నారు. సినీరంగంలో కూడా ఇరువురి మధ్య
విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దమ్ము సినిమా విడుదల
రోజు తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా బంద్ పాటించడం పట్ల
జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు
తెలుస్తోంది.
తెలుగుదేశం
పార్టీకి జవజీవాలు పోయడానికి తాను సిద్ధంగా ఉన్నానని,
తాను పార్టీ ప్రచార కార్యక్రమాన్ని భుజాన వేసుకుంటానని బాలయ్య
చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో చిచ్చు పెట్టడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నట్లు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు దూరమై చాలా రోజులే
అవుతోంది. చంద్రబాబు తన తనయుడు నారా
లోకేష్కు పార్టీ పగ్గాలు
అప్పగించడానికి చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకోవడానికి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు
వస్తున్న విషయం తెలిసిందే.
జూనియర్
ఎన్టీఆర్, తాము తెలుగుదేశం పార్టీకి
పని చేస్తామని, అయితే కార్యకర్తలకు అన్యాయం
జరిగితే సహించబోమని పలు సందర్భాల్లో హరికృష్ణ
అన్నారు. అంటే, తమకు అనుకూలంగా
ఉన్న పార్టీ నాయకుల పట్ల చంద్రబాబు వివక్ష
ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయం హరికృష్ణలో బలంగా ఉన్నట్లు చెబుతున్నారు.
వల్లభనేని వంశీ, గుడివాడ శాసనసభ్యుడు
కొడాలి నానిలను చిన్నచూపు చూస్తున్నారనే అభిప్రాయం ఉంది.
0 comments:
Post a Comment