హైదరాబాద్:
సినిమాల్లో వేషాలను ఎరగా చూపి యువతులను
వ్యభిచార కూపంలోకి నెట్టి అరెస్టయిన వర్ధమాన నటి తారా చౌదరికి
నలుగురు హీరోలతో సంబంధం ఉన్నట్లు ఆమె సహాయకుడు హనీఫ్
వెల్లడించాడు. పోలీసుల విచారణలో హనీఫ్ ఆ విషయాన్ని
వెల్లడించినట్లు ఓ ప్రముఖ దినపత్రిక
రాసింది. తారా చౌదరి కేసులో
హనీఫ్ను పోలీసులు హైదరాబాదులోని
ఇందిరానగర్లో సిఐడి అరెస్టు
చేసింది. హనీఫ్ను శుక్రవారం
రిమాండ్కు తరలించారు.
హనీఫ్
నుంచి ఓ స్పై కెమెరాతో
పాటు ఓ డిజిటల్ కెమెరాను
సిఐడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తారా చౌదరి ఇంటికి
వచ్చిన ప్రముఖుల శృంగార లీలలను చిత్రీకరించడం, వాయిస్ రికార్డింగ్, ఫొటోలు తీయడం వంటి పనులు
హనీఫ్ చేసేవాడు. తారా చౌదరి ఇంటికి
రాజ్కుమార్ అనే నిర్మాత వచ్చేవాడని
హనీఫ్ వెల్లడించినట్లు ఆ పత్రిక రాసింది.
డిజిటల్ కెమెరాతో ప్రముఖుల రాసలీలలను చిత్రీకరించి, ల్యాప్టాప్ ద్వారా సీడీల్లోకి
మార్చేవాడినని హనీఫ్ చెప్పాడు.
పలువురు
సినీ ప్రముఖులు తారా చౌదరితో సంబంధాలు
పెట్టుకును్నారని, నలుగురు హీరోలు మాత్రం తరుచూ వస్తుండేవారని అతను
చెప్పాడు. నిర్మాతలు, దర్శకులు, సినీ నిర్మాతలు తారా
చౌదరి ఉచ్చులో ఇరుక్కున్నట్లు హనీఫ్ చెప్పాడు. సుమారు
90 మంది ప్రముఖుల సీడీలు రూపొందించినట్లు అతను తెలిపాడు. సినీ
ఫైనాన్షియర్గా మారిన తారా
చౌదరి ఓ ప్రముఖ హీరోతో
సినిమా తీయడానికి కూడా సిద్ధపడిందని అతను
చెప్పాడు.
తాను
మధ్యవర్తిగా ఉండి, ఓ వ్యక్తికి
ఇప్పించిన రూ. 25 వేల అప్పు తీర్చకపోవడంతో
తారా చౌదరి తనను ఇంట్లో
నిర్బంధించినట్లు, వెళ్లిపోతే దొంగతనం కేసు పెడతానని బెదిరించినట్లు
అతను తెలిపాడు. తాను ఏ తప్పూ
చేయలేదని అతను అన్నాడు. తారా
చౌదరి తనను బ్లాక్ మెయిల్
చేసి తప్పుడు పనులు చేయించిందని అతను
చెప్పుకున్నాడు.
0 comments:
Post a Comment