హైదరాబాద్:
భాను కిరణ్ చేతిలో హతమైన
గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి భార్య గంగుల
భానుమతి శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని
కలిశారు. సూరి హత్య కేసులో
ప్రధాన నిందితుడు భాను కిరణ్ను
సిఐడి పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె
ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
తనకు రక్షణ కల్పించాలని కోరడానికి
మాత్రమే తాను ముఖ్యమంత్రిని కలిసినట్లు
గంగుల భానుమతి భేటీ అనంతరం మీడియా
ప్రతినిధులతో చెప్పారు.
తన భర్త సూరి హత్య
వెనక తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉందని ఆమె
ఆరోపించారు. మద్దెలచెర్వు సూరి ఆస్తులు తనకే
దక్కాలని ఆమె అన్నారు. సూరి
పేరు మీద భాను కిరణ్
అక్రమ సంపాదన చేశాడని ఆమె ఆరోపించారు. భాను
కిరణ్కు చాలా మంది
పెద్దల అండ ఉందని ఆమె
ఆరోపించారు. వెన్నుపోటు పొడిచిన భాను కిరణ్ను
కఠినంగా శిక్షించాలని కోరానని ఆయన అన్నారు. పరిటాల
రవి హత్య కేసులో సూరి
పాత్ర ఉందని చంద్రబాబు మొదటి
నుంచీ మాట్లాడుతున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె
అన్నారు. సూరిని హత్య చేసినవారిపై కఠిన
చర్యలు తీసుకోవాలని తాను ముఖ్యమంత్రిని కోరినట్లు
ఆమె తెలిపారు.
భాను
కిరణ్ను సిఐడి అధికారులు
అరెస్టు చేయడం పట్ల ఇటీవల
ఆమె హర్షం వ్యక్తం చేసిన
విషయం తెలిసిందే. భాను కిరణ్ చాలా
నమ్మకంగా మెలిగేవాడని, సూరిని హత్య చేస్తాడని అనుకోలేదని,
అయితే డబ్బు కక్కుర్తి మాత్రం
ఉండేదని భానుమతి ఇటీవల అన్నారు. గంగుల
భానుమతి మొదటి నుంచి కాంగ్రెసుకు
అనుకూలంగా ఉంటూ వస్తున్నారు.
భానుమతి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా గతంలో జరిగింది.
అయితే, తర్వాత ఆమె మళ్లీ కాంగ్రెసుకు
దగ్గరయ్యారని అంటున్నారు. గతంలో పోటీకి గంగుల
భానుమతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించినప్పటికీ
అవకాశం లభించలేదని అంటారు.
0 comments:
Post a Comment