విజయవాడ:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని
కలిసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ
నాయకత్వం ఆగ్రహానికి గురయ్యారు. ఏ మాత్రం జాప్యం
చేయకుండా ఆ సంఘటనపై తెలుగుదేశం
పార్టీ నాయకత్వం స్పందించింది. వంశీకి తెలుగుదేశం పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం
సాయంత్రం జగన్ను కలిసిన
సంఘటనపై వివరణ ఇవ్వాలని పార్టీ
వంశీని ఆదేశించింది.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
తనకు మంచి మిత్రుడని, రాజకీయాలు
వేరు - స్నేహం వేరని వంశీ శుక్రవారం
సాయంత్రమే చెప్పారు. రాధాకృష్ణతో ఉన్న స్నేహం వల్లనే
తాను అక్కడే ఉన్న వైయస్ జగన్తోనూ మాట్లాడాల్సి వచ్చిందని
ఆయన అన్నారు. అయితే, ఈ మాటలను తెలుగుదేశం
పార్టీ నాయకత్వం పట్టించుకున్నట్లు కనిపించలేదు. వెంటనే వంశీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. తెలుగుదేశం
పార్టీ ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేరు మీద వంశీకి
షోకాజ్ నోటీసు జారీ అయింది. జగన్ను వంశీ కలవడం
వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని టిడిపి నాయకత్వం భావిస్తోంది.
తెలుగుదేశం
పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ శుక్రవారం సాయంత్రం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని
కలిశారు. ఈ సంఘటన విజయవాడలో
సంచలనం సృష్టించింది. వైయస్ జగన్పై
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నిప్పులు చెరుగుతున్న స్థితిలో వంశీ ఆయనను కలుసుకుని
నవ్వుతూ మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ యాదృచ్ఛికంగా
జరిగిందా, కావాలనే జరిగిందా అనే విషయంపై విజయవాడలో
వేడివేడిగా చర్చ జరుగుతోంది.
మాజీ
శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్న సందర్భంగా వైయస్ జగన్ విజయవాడ
వచ్చారు. వైయస్ జగన్ ర్యాలీ
సాగుతున్న సమయంలోనే వంశీ ట్రాఫిక్లో
చిక్కుకుపోయారని అంటున్నారు. అయితే, వంశీని చూసిన వంగవీటి రాధాకృష్ణ
ఆ విషయం జగన్తో
చెప్పారు. ఇదే సమయంలో వంశీ
వాహనం దిగి జగన్ వైపు
వచ్చారు. జగన్, వంశీ పరస్పరం
ఆలింగనం చేసుకున్నారు. నవ్వుతూ మాట్లాడుకున్నారు. దాదాపు రెండు నిమిషాల పాటు
వారు మాట్లాడుకున్నారు. ఈ సమయంలో వంగవీటి
రాధాకృష్ణ కూడా పక్కనే ఉన్నారు.
అయితే,
వైయస్ జగన్కు, రాధాకు
వంశీ ఆల్ ద బెస్ట్
చెప్పారని అంటున్నారు. రాధాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి తాను ఆగినట్లు వంశీ
చెప్పారు. అయితే, కృష్ణా జిల్లాలో భారీ రాజకీయ మార్పులు
సంభవించనున్నాయని గత కొంత కాలంగా
ప్రచారం జరుగుతోంది. దానికి సంకేతంగానే జగన్తో వంశీ
భేటీ జరిగి ఉండవచ్చునని అంటున్నారు.
జగన్ కాన్వాయ్ వస్తుందని తెలిసి వంశీ అటుగా వెళ్లడం
యాదృచ్ఛికమేమీ కాదని కొంత మంది
అంటున్నారు. ముందు అనుకున్న ప్రకారమే
ఈ భేటీ జరిగిందని చెబుతున్నారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీలోకి వంశీ వెళ్తారని అప్పట్లో
ప్రచారం జరిగింది. అయితే, తనను తెలుగుదేశం పార్టీలో
ఎవరైనా పంపించాలని చూస్తే అప్పుడు ఏ పార్టీలో చేరాలనేది
ఆలోచిస్తానని వంశీ రెండు రోజుల
క్రితం అన్నారు. ఓ ఎమ్మెల్యే కూడా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, విజయవాడ రాజకీయాల్లో ఉప ఎన్నికలు ముగిసిన
తర్వాతనే మార్పులు సంభవించే అవకాశాలున్నాయని అంటున్నారు. తమ పార్టీ కృష్ణా
జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావుతో తగాదా పడినప్పుడు వంశీ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే, తాను ఎన్టీఆర్ కుటుంబంతోనే
ఉంటానని వంశీ చెప్పారు. జూనియర్
ఎన్టీఆర్తో వంశీకి సన్నిహిత
సంబంధాలున్నాయి.
0 comments:
Post a Comment