హైదరాబాద్:
సూరి హత్య కేసులో ప్రధాన
నిందితుడు భాను కిరణ్ ఇటీవల
బెంగళూర్లో ఓ ఐపియల్
మ్యాచ్ చూసినట్లు వార్తలు వస్తున్నాయి. అతను ఐపియల్ మ్యాచ్
చూస్తుండగా ఓ వ్యక్తి ఫొటోలు
చూసినట్లు కూడా తెలుగు టీవీ
చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా బెంగళూర్లోని ఓ మంత్రి
కార్యక్రమంలో కూడా ఆతను పాల్గొన్నట్లు
చెబుతున్నారు. దీన్నిబట్టి బెంగళూర్లోని వ్యక్తులతో అతనికి
సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు.
కాగా,
హైదరాబాద్ వస్తూ జహీరాబాద్ వద్ద
పట్టుబడినట్లు చెబుతున్న భాను కిరణ్ను
పోలీసులు రాష్ట్ర డిజిపి కార్యాలయానికి తరలించారు. డిజిపి కార్యాలయం వద్ద పోలీసుల మధ్య
ఉన్న భాను కిరణ్ ఛాయాచిత్రాలను
తెలుగు టీవీ చానెళ్లు చూపిస్తున్నాయి.
భాను కిరణ్‌ను సిఐడి పోలీసులు
విచారిస్తున్నట్లు చెబుతున్నారు.
సూరిని
హత్య చేసిన తర్వాత పారిపోయిన
భాను కిరణ్ కోసం సిఐడి
పోలీసులు దేశంలోని పలు ప్రాంతాల్లో గాలించారు.
హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో పోలీసులు
గాలించారు. సూరి తరఫున సెంటిల్మెంట్లు
నిర్వహించిన భాను కిరణ్ తెలుగు
సినీ నిర్మాతలతో కూడా సంబంధాలు పెట్టుకున్నట్లు,
సినిమాలకు పెట్టుబడులు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అతనికి నిర్మాతలు సి. కళ్యాణ్, శింగనమల
రమేష్లతో సంబంధాలున్నట్లు వార్తలు
వచ్చాయి.
భాను
కిరణ్తో సంబంధాలున్నాయని అనుమానిస్తూ
పోలీసులు సి. కళ్యాణ్, శింగనమల
రమేష్లను విచారించారు. వారిని
అరెస్టు కూడా చేశారు. ఆ
తర్వాత వారు బెయిల్పై
విడుదలయ్యారు. సూరిని అడ్డం పెట్టుకుని భాను
కిరణ్ విపరీతంగా సంపాదించినట్లు వార్తలు వచ్చాయి. ఆర్థిక లావాదేవీల్లో ఇరువురి మధ్య తగాదాలే సూరి
హత్యకు కారణమని అనుమానిస్తూ వస్తున్నారు. విజయవాడకు సంబంధించిన ఓ సంస్థకు సంబంధించిన
వివాదంలో తలదూర్చినట్లు కూడా భాను కిరణ్పై ఆరోపణలున్నాయి.
కాగా,
భాను కిరణ్ అరెస్టుపై సూరి
భార్య గంగుల భానుమతి స్పందించారు.
భాను కిరణ్ అరెస్టు మంచి
పరిణామమని, జీవితాంతం అతన్ని జైల్లోనే ఉంచాలని ఆమె అన్నారు. మళ్లీ
ఇటువంటి ఘటన జరగకుండా భానును
శిక్షించాలని ఆమె అన్నారు. ఇప్పటికైనా
తన భర్త హత్య కేసులో
వాస్తవాలు బయటకు వస్తాయని అనుకుంటున్నట్లు
ఆమె వ్యాఖ్యానించారు.
0 comments:
Post a Comment