శ్రీకాకుళం:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నట్టేట మునుగుతారని మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆదివారం అన్నారు.
జగన్వి వ్యాపార రాజకీయాలని
విమర్శించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విలేకరులతో ధర్మాన ప్రసాద రావు మాట్లాడారు. దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రవేశపెట్టిన పథకాలు ప్రస్తుతం అమలుకానట్లు చెబుతున్న జగన్ కళ్లు తెరిచి
చూడాలని సూచించారు.
ప్రజలకు
కల్లబొల్లి మాటలు చెప్పి నంగనాచిలా
మాట్లాడుతున్న జగన్ను నమ్ముకుంటే
నట్టేట ముంచుతాడన్నారు. అలా జగన్ను
నమ్మివెళ్లిన వ్యక్తులు తమ తప్పును గుర్తించే
రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. నరసన్నపేట ఉప ఎన్నికల్లో జగన్
వచ్చి కుర్చున్నా ప్రజలంతా కాంగ్రెస్కే పట్టం కడతారని
ధీమా వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడైన జగన్ను ఏ
ఒక్కరైనా నిజాయితీపరుడు అని చెప్పగలరా అని
ప్రశ్నించారు.
లక్ష
కోట్ల రూపాయలు ఆర్జించి అరవయ్యేడు కంపెనీలను స్థాపించి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఏర్పాటు చేసుకున్న టివి ఛానెల్, పత్రిక
మినహాయిస్తే ఎవరూ జగన్ను
నీతిమంతుడు అని అనరని ధర్మాన
జగన్ పైన మండిపడ్డారు. ఆయన
తన తీరును మార్చుకోవాలని సూచించారు.
కాగా
వైయస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడితే తమ పార్టీకే నష్టమని
కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకట రెడ్డి
వేరుగా గుంటూరు జిల్లాలో అన్నారు. ఆయన ఆదివారం బాపట్లలో
విలేకరులతో మాట్లాడారు. వైఎస్ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందనడం సరికాదన్నారు. వైయస్ చేసిన మంచి
పనులను మరచిపోరాదని కోరారు.
వైయస్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు
చేయడంవల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వైయస్పై మాట్లాడేటప్పుడు
ఇదంతా ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు.
కులాలు, మతాలను బట్టి పార్టీలు నడుస్తాయనడం
సరికాదని చెప్పారు. ఏ పార్టీ రాణించాలన్నా
అన్ని కులాల సహకారం కావాలన్నారు.
0 comments:
Post a Comment