హైదరాబాద్:
గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేసి ఆ
తర్వాత ఆ పార్టీని వీడిన
ప్రముఖ సినిమా తారలు మళ్లీ సొంతగూటికి
చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా
కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుండి గతంలో రాజ్యసభ
సభ్యులుగా పని చేసిన కలెక్షన్
కింగ్ మోహన్ బాబు, ఉత్తర
ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లోకసభ నియోజకవర్గ పార్లమెంటు
సభ్యురాలు జయప్రద తిరిగి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు
దగ్గరవుతున్నారు. వారి ప్రకటనలు చూస్తుంటే
తిరిగి టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.
ఇటీవల
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు జయప్రద వచ్చారు. ఆ సమయంలో ఆమె
చంద్రబాబును పొగడ్తలలో ముంచెత్తారు. చంద్రబాబు రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు సమర్థవంతంగా పాలించారని, ఏదో కొన్ని కారణాల
వల్ల తాను రాష్ట్రం నుండి
వెళ్లి పోయానని చెప్పారు. ప్రస్తుతానికి రాష్ట్రానికి రావాలని అనుకోవడం లేదని కానీ భవిష్యత్తులో
వస్తానేమో చెప్పలేనన్నారు. శ్రీవారిని తెలుగువారికి సేవ చేసే అవకాశం
కల్పించాలని కోరుకున్నానని చెప్పారు.
అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు.
తాను రాష్ట్రానికి వస్తే ఎక్కడ ఉండాలో
నిర్ణయించుకోలేదని చెబుతూనే చంద్రబాబును మాత్రం ప్రశంసించారు. తాను బాబును ఎప్పుడూ
విమర్శించలేదని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో
ఆమె చెప్పక పోయినప్పటికీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందనే
వాదనలు వినిపించాయి.
ఇక స్వర్గీయ నందమూరి తారక రామారావుపై అభిమానంతో
టిడిపిలో చేరిన మోహన్ బాబు
ఆ తర్వాత క్రమంగా చంద్రబాబుకు దూరమయ్యారు. అప్పటి నుండి ఆయన దాదాపు
రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. అయితే ఇటీవల తన
గురువు దాసరి నారాయణ రావుకు
కాంగ్రెసు పార్టీలో ఎదురు దెబ్బ తగలడంతో
మోహన్ బాబు తిరిగి తెలుగుదేశం
పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల తన అరవయ్యో
జన్మదినోత్సవాన్ని శ్రీవిద్యానికేతన్ పాఠశాలలో జరుపుకున్న మోహన్ బాబు టిడిపి
అధినేతను ఆహ్వానించారు.
ఇద్దరూ
ఒకే వేదికపైకి రావడం చాలా రోజుల
తర్వాత మొదటిసారి. అప్పుడే వారిద్దరూ తమ మధ్య ఎలాంటి
మనస్పర్ధలు లేవని చెప్పుకొచ్చారు. వారిద్దరు
పరస్పరం పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. అప్పుడే మోహన్ బాబు టిడిపిలో
చేరతారని, తిరుపతి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారేమో అనే ప్రచారం జరిగింది.
అయితే అది జరగలేదు.
కానీ
ఆదివారం శ్రీవారి, శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనానికి వచ్చిన మోహన్ బాబు తాను
క్రియాశీలక రాజకీయాలలోకి వస్తున్నట్లు చెప్పారు. ఏ పార్టీలో చేరాలో
మీరే చెప్పాలని జర్నలిస్టులకు సూచించారు. అయితే ఆయన మనసులోని
మాట మాత్రం బయట పడిందని అంటున్నారు.
అప్పుడు కూడా ఆయన చంద్రబాబుపై
ప్రశంసలు గుప్పించారు. అంతేకాదు బాబు నిత్యం జపం
చేసే అన్నా హజారే పేరును
మోహన్ బాబు తన నోట
పలికారు. తాను అవినీతిపై యుద్ధం
చేస్తానని ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలు కూడా
టిడిపి వైపు మళ్లేందుకు రంగం
సిద్ధం చేసుకున్నట్లుగా ఉన్నాయని అంటున్నారు.
0 comments:
Post a Comment