వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల
కేసులో విచారణ ఎదుర్కుంటున్నప్పటికీ పెన్నా గ్రూప్ తన ప్రాబల్యాన్ని కోల్పోనట్లు
కనిపిస్తోంది. పెన్నా గ్రూప్నకు చెందిన పెన్నా
సిమెంట్స్కు అటవీ శాఖ
రిజర్వ్ ఫారెస్టు ల్యాండ్ను కేటాయించింది. ఇందుకు
సంబంధించి ఓ ఆంగ్ల దినపత్రిక
ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. నల్లగొండ జిల్లా దామచర్ల మండలం గణేష్పహాడ్
వద్ద 1.85 ఎకరాల భూమిని రైల్వే
ఫెసిలిటీ నిర్మాణం కోసం అటవీ శాఖ
కేటాయించింది.
ఆ పత్రిక కథనం ప్రకారం - భూమి
కేటాయింపు ప్రతిపాదనలను అటవీ శాక ప్రిన్సిపల్
చీఫ్ కన్జర్వేటర్ సమర్పించారు. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ
కూడా ఆ భూమికి 20 ఏళ్ల
పాటు షరతలతో కూడిన అనుమతిని మంజూరు
చేసింది. క్విడ్ ఫ్రో కింద వైయస్
జగన్ ఆస్తుల కేసులో పెన్నా సిమెంట్స్ ఆరోపణలు ఎదుర్కుంటోంది.
వైయస్
రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పొందిన ప్రయోజనాలకు గాను పెన్నా సిమెంట్స్
వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు
పెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తును ఎదుర్కుంటోంది.
సిబిఐ మరో చార్జిషీట్ దాఖలు
చేయనుందని, ఈ స్థితిలో ఆ
సంస్థకు భూమిని కేటాయించడం, అదీ అభయారణ్యం భూమిని
కేటాయించడం ప్రశ్నార్థకంగా మారిందని అధికారులంటున్నారు.
వైయస్
జగన్ ఆస్తుల కేసులో సిబిఐ పెన్నా సిమెంట్స్ను 14వ నిందితురాలిగా
చేర్చింది. ఆ సంస్థ ప్రమోటర్
పి. ప్రతాప రెడ్డిని 15వ నిందితుడిగా చేర్చింది.
వైయస్ జగన్ కంపెనీల్లో ఒక్కటైన
కార్మెల్ ఆసియా హోల్డింగ్స్లో
పెన్నా సిమెంట్స్ 23 కోట్ల రూపాయలు పెట్టుబడిగా
పెట్టినట్లు చెబుతున్నారు. అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థకు రెవెన్యూ
శాఖ 2008లో భూమి కేటాయించినట్లు
ఆరోపణలున్నాయి. దానికితోడు పెన్నా సిమెంట్స్కు 2008లో కర్నూలు జిల్లాలో
304 ఎకరాల్లో సున్నం రాయి తవ్వకాలకు పరిశ్రమలు,
వాణిజ్య శాఖ ప్రాస్పెక్టివ్ లైసెన్సు
ఇచ్చింది.
0 comments:
Post a Comment