హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని
నమ్ముకున్న వారందరూ ఇప్పుడు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం పార్టీ శాసనమండలి నేత రాజేంద్ర ప్రసాద్
సోమవారం అన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో
మీడియా సమావేశంలో మాట్లాడారు. వారిని నమ్ముకున్న పారిశ్రామికవేత్తలు, అధికారులు ఇప్పుడు జైళ్లలో మగ్గుతూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.
దివంగత
నేత, మాజీ టిడిపి మంత్రి
పరిటాల రవీంద్ర హత్యను కప్పిపుచ్చుకునేందుకు జగన్ అనేక వరుస
హత్యలను చేయించింది నిజం కాదా అని
ప్రశ్నించారు. పరిటాల హత్య కేసులో తనకు
క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు సిబిఐని
నమ్మిన జగన్ ఇప్పుడు ఎందుకు
నమ్మడం లేదని ఆయన ప్రశ్నించారు.
అప్పుడు లేని అనుమానం ఇప్పుడు
ఆయనకు కలగడం శోచనీయం అన్నారు.
రాష్ట్రంలో
ఎక్కడ ఏ నేరపూరిత ఘటన
జరిగినా తీగలాగితే పులివెందుల డొంకే కదులుతోందని ఆయన
ఆరోపించారు. దేశ చరిత్రలో జగన్
అత్యంత అవినీతిపరుడిగా, దోపిడీదారుడిగా మిగిలిపోతారని విమర్శించారు. ప్రజల సానుభూతి కోసం
జగన్ ఏడుపుగొట్టు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్సించారు.
కులాన్ని,
మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు నడిపిన వాళ్లు ఎంతోకాలం మనుగడ సాగించలేరని అన్నారు.
సాక్షిలో వచ్చిన దుష్టచతుష్టయంకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి, భానుకిరణ్, మద్దెలచెర్వు సూరి, మంగళి కృష్ణలు
దుష్టచతుష్టయం అన్నారు.
వైయస్
జగన్ ఓదార్పు యాత్ర ముగిసిందని, ఇక
దృతరాష్ట్ర కౌగిలి యాత్ర ప్రారంభమైందని విమర్శించారు.
జగన్ది దృతరాష్ట్ర కౌగిలి
అని తెలుసుకోవాలన్నారు. జగన్, విజయవాడ నగర
పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ ల డ్రామాను జూనియర్
ఎన్టీఆర్కు ఆపాదించవద్దని రాజేంద్ర
ప్రసాద్ సూచించారు. వంశీ వివరణ ఇచ్చారని
చెప్పారు. జగన్ విష కౌగిలిలోకి
వెళ్లేందుకు టిడిపి నేతలు ఎవరూ సిద్ధంగా
లేరన్నారు. జగన్ తనకు కనిపిస్తే
తాను మొహం తిప్పేసుకొని వెళతానని
చెప్పారు.
0 comments:
Post a Comment