వరంగల్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్
నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అక్రమాల చిట్టా
తాను త్వరలో బయటపెడతానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి
కొండా సురేఖ సోమవారం వరంగల్
జిల్లాలో అన్నారు. తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకున్న
ఎంతమంది అమరవీరుల కుటుంబాలను తెరాస ఆదుకుందో చెప్పాలని
ఆమె కెసిఆర్ను డిమాండ్ చేశారు.
పదకొండు
ఏళ్లుగా తెరాస, కాంగ్రెసు పొత్తు కొనసాగుతోందన్నారు. తెరాస గెలిస్తే తెలంగాణ
వస్తుందంటే తాను పోటీ నుండి
తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇన్నేళ్లుగా వారు గెలుస్తూ వస్తుంటే
తెలంగాణ సాధించారా అని ఆమె ప్రశ్నించారు.
తెలంగాణ ఎప్పుడొస్తే అప్పుడు తాను పోటీ నుండి
తప్పుకుంటానని చెప్పారు. తెరాస గెలిస్తే తెలంగాణ
వస్తుందా అని ఆమె అన్నారు.
తెలంగాణ
రాజకీయ ఐక్య కార్యాచరణ ముసుగులో
తెరాస దగా చేస్తుందని స్వయంగా
కెసిఆర్ ఒప్పుకున్నారన్నారు. జెఏసి చైర్మన్ కోదండరామ్
పరకాల ఓటర్లను వంచించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఉప
ఎన్నికలలో తన గెలుపు ఖాయమని
ఆమె చెప్పారు.
తెలుగుదేశం
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
నైజం స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎప్పుడో
చెప్పారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశ్
రావు హైదరాబాదులో అన్నారు. నీచ రాజకీయాలు చేసే
అలవాటు చంద్రబాబుకే ఉందని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు
సొంతగా ఎప్పుడూ గెలవలేదని విమర్శించారు. ఆయనకు మతిస్థిమితం తప్పిందన్నారు.
నిరాశ, నిస్పృహలతోనే చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని
మండిపడ్డారు. ఉప ఎన్నికల తర్వాత
తెలుగుదేశం పార్టీలో సంక్షోభం తప్పదన్నారు.
0 comments:
Post a Comment