హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, కర్నాటక మాజీ
మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి
ఓఎంసి కేసు, ఎమ్మార్ వంటి
కీలక కేసులలో దర్యాఫ్తును పర్యవేక్షిస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్
లక్ష్మీ నారాయణ తనకు ప్రత్యేకంగా భద్రత
అవసరం లేదని శనివారం స్పష్టం
చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు కేటాయించిన ఎనిమిది
మంది సాయుధ పోలీసులను వెనక్కు
పంపించారు.
అవసరమైతే
భద్రత కల్పించాల్సిందిగా తామే కోరతామని స్పష్టం
చేశారు. సిబిఐ ఎస్పీ వెంకటేశ్
కూడా రాష్ట్ర పోలీసులకు ఇదే సమాచారం పంపించారు.
గాలి గనుల మాఫియా, ఎమ్మార్
కుంభకోణం, జగన్ అక్రమాస్తుల కేసుతోపాటు
గుజరాత్ ఎన్కౌంటర్లలాంటి కీలక
కేసులు దర్యాప్తు చేస్తున్న లక్ష్మీ నారాయణ, వెంకటేశ్లకు తగిన భద్రత
కల్పించాలని ఇటీవల కేంద్ర నిఘా
వర్గాలు రాష్ట్ర సర్కారుకు సూచించాయి.
ఈ నేపథ్యంలో లక్ష్మీ నారాయణకు ప్రభుత్వం వై కేటగిరీ భద్రతతోపాటు,
బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ఎస్పీ వెంకటేశ్కు
వన్ ప్లస్ వన్ గన్మెన్ను ఇచ్చారు.
రెండు రోజుల క్రితం ఎనిమిది
మంది గన్మెన్ కోఠిలోని
సిబిఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి లక్ష్మీ నారాయణ వద్ద రిపోర్టు చేశారు.
అయితే, తనకు గన్మెన్
భద్రత వద్దని లక్ష్మీ నారాయణ సున్నితంగా తిరస్కరించారు.
ఎస్పీ
వెంకటేశ్ నుంచి కూడా ఇదే
విధమైన సమాచారం పోలీసు ఉన్నతాధికారులకు అందినట్లు తెలుస్తోంది. అవసరమని భావిస్తే తామే భద్రత కోరతామని
కూడా వీరు చెప్పినట్లు సమాచారం.
వీరు గన్మెన్ను
వెనక్కు పంపినప్పటికీ కేంద్ర నిఘా వర్గాల సూచనల
నేపథ్యంలో వీరిద్దరి ఇళ్ల వద్ద ఒక్కో
సాయుధ పోలీసును నియమించినట్లు సైబరాబాద్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు తెలిపారు.
0 comments:
Post a Comment