నెల్లూరు:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని
కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి
డెకాయిట్గా పోల్చారు. రాష్ట్రాన్ని
దోచుకున్న దోపిడీదారుడని ఆయన వైయస్ జగన్పై వ్యాఖ్యానించారు. శుక్రవారం
మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన వైయస్ జగన్పై తీవ్రంగా ధ్వజమెత్తారు.
సమృద్ధిగా ఆరోగ్యవంతమైన భోజనాన్ని వండిపెట్టిన ఇంటిలోకి దొంగకుక్కలా దూరి మొత్తం తినేసిన
విధంగా రాష్ట్రాన్ని జగన్ దోచుకున్నాడని, జగన్
తిని పారేసిన ఎంగిలి మెతుకులు ఏరుకుంటూ అంబటి రాంబాబు వంటి
వాళ్లు వందల కోట్లు సంపాదించుకున్నారని
ఆయన వ్యాఖ్యానించారు.
'రంగ
ది దొంగ' సినిమాలో శ్రీకాంత్
పాత్ర వైయస్ జగన్దేనని
ఆయన అన్నారు. లంచగొండ్లు, అవినీతిపరులు, అక్రమార్కులు, ఫ్యాక్షనిస్టులు అనే పదాలు ఉండగా
జగన్తోనే డెకాయిట్ పదం
రాజకీయాల్లో ప్రారంభమైందని, ఇది దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం కష్టపడి పని
చేసిన వారందరినీ దూరంగా పెట్టారని, వైయస్ దొంగలన్న వారినే
జగన్ పక్కన పెట్టుకున్నారని, అది
ఒక దొంగల పార్టీ అని
ఆయన దుయ్యబట్టారు. అంబటి రాంబాబు గొంగళి
అంటూ ధ్వజమెత్తారు. తమను విమర్శించే అర్హత
రాంబాబుకు లేదన్నారు.
తరతరాలుగా
ప్రజలతో కలిసి బతుకుతున్న కుటుంబం
తమదని, అదే తమకు తెలిసిన
నీతి అని ఆనం ఆయన
తెలిపారు. రాజకీయాల్లో ఇల్లు, వాకిలి, దారి, డొంక లేని
రాంబాబు తమపై విమర్శలు చేస్తుండటం
అసహ్యంగా ఉందన్నారు. పుట్టింటోళ్లు తరిమేశారు.. కట్టుకున్నోడు వదిలేశాడన్న మాట అంబటి రాంబాబుకు
అతికినట్లు సరిపోతుందన్నారు. రాజకీయాల్లో గెలుపోటములపై సవాళ్లు విసురుతూ వారి బుద్ధిని చూపుతున్నారని
మండిపడ్డారు.
ఆనం వివేకానంద రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర
వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగే ఉప ఎన్నికలపై
కూడా మాట్లాడారు.
0 comments:
Post a Comment