శ్రీకాకుళం:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సాక్షి
దినపత్రిక అబద్ధాల పుట్ట అని ధర్మాన
ప్రసాద రావు అన్నారు. జగన్
పత్రికను ఎవరూ చదవ వద్దని
ఆయన పిలుపునిచ్చారు. జగన్ తన అక్రమాలను
కప్పిపుచ్చుకోవడానికే ఆ పత్రికను నడుపుతున్నారని
ఆయన ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ధర్మాన ప్రసంగించారు.
ప్రజలు
వద్దంటున్నా, చదవండంటూ ఇళ్ల దగ్గర జగన్
పత్రికను పడేస్తున్నారని మంత్రి చెప్పారు. ఆ పత్రికను ఎవరూ
చదవ కూడదని ఆయన సూచించారు. తన
కుటుంబానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందని చెబుతున్న వైయస్ తన తండ్రి
వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే లక్షల కోట్ల రూపాయలకు
అధిపతి ఎలా అయ్యారని ఆయన
అన్నారు. ఎలా లక్షల కోట్లకు
అధిపతి అయ్యారో జగన్ ప్రజలకు చెప్పాలని
ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్
వల్ల వైయస్ కుటుంబంలా మేలుపొందిన
కుటుంబం ఇంకొకటి ఈ దేశంలోనే లేదని
ఆయన అన్నారు. ఫ్యూడల్ భావజాలంతో 60 గదుల ఇంట్లో విలాసవంతమైన
జీవనాన్ని గడిపే జగన్కు
నిస్వార్థానికి నిలువెత్తు నిదర్శనమైన సోనియా గాంధీని తలచుకునే హక్కు కూడా లేదని
అన్నారు. ముఖ్యమంత్రి పదవిని సంపాదించి దోచుకోవడానికి పన్నాగాలు పన్నుతున్నారని, జగన్ ముఖ్యమంత్రి అయితే
పేదలు తలదాచుకోవడానికి చోటు కూడా మిగలనివ్వడని
అన్నారు.
అలాంటి
జగన్ వెంట తన అన్న
ధర్మాన కృష్ణదాస్ వెళ్లడం తమ కుటుంబానికీ, కాంగ్రెస్ను అభిమానించే అందరికీ
తలవంపులు తీసుకొచ్చిందని ధర్మాన చెప్పారు. ఇలాంటి స్వార్థపరులకు బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన రామదాసు 15 వేల ఓట్ల మెజారిటీతో
విజయం సాధిస్తారన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment