గౌహతి:
అస్సాంలోని ధుబ్రీ జిల్లాలో బ్రహ్మపుత్ర నదిలో సోమవారం నాటు
పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మంది
మరణించి ఉంటారని, పలువురు గల్లంతయ్యారని అనుమానిస్తున్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో పడవలో 250 మంది ఉన్నట్లు సమాచారం.
గౌహతికి
350 కిలోమీటర్ల దూరంలో గల ఫకీర్గ్రామ్
సమీపంలో ఈ దారుణం చోటు
చేసుకుంది. ధుబ్రీఘాట్ నుంచి పడవ నదిని
దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు
డిప్యూటీ కమిషనర్ కుముద్ చంద్ర కలిత చెప్పారు.
ప్రమాదంలో 35 మంది మునిగిపోయినట్లు అనుమానిస్తున్నారు.
కాగా,
25 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నారు.
జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. 35 మృతదేహాలను వెలికి తీశారు. మిగతా వారి కోసం
గాలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని
అనుమానిస్తున్నారు.
సైన్యానికి
చెందిన వంద మంది అధికారులు
సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వైద్య, ఇంజనీరింగ్ బృందాలు సహాయక చర్యల్లో పాలు
పంచుకుంటున్నాయి. ప్రధాని మన్మోహన్ సింగ్ అస్సాం ప్రజలకు
తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తగిన సహాయ చర్యలు
చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ప్రధాని
పడవ ప్రమాదంపై దిగ్భ్రాంతికి గురయ్యారని, మృతులకు సంతాపం ప్రకటించారని ప్రధాని కార్యాలయం నుంచి వెలువడిన ఓ
ప్రకటన తెలిపింది.
0 comments:
Post a Comment