బెంగళూరు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలలో ఉన్న కుళ్లూ, కుతంత్రాల
వల్లనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి
కాలేక పోయారని బిఎస్సార్ పార్టీ అధినేత, బళ్లారి గ్రామీణ శాసనసభ్యుడు శ్రీరాములు ఆదివారం అన్నారు. ఆయన బళ్లారిలో మీడియాతో
మాట్లాడారు. రానున్న కాలంలో దేశంలో ప్రాంతీయ పార్టీల హవానే ఉంటుందని ఆయన
చెప్పారు.
కాగా
అనంతపురం జిల్లాలో బళ్లారి పాలిటిక్స్ ప్లే కానున్నాయని గతంలో
వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అనంతపురం
జిల్లాలో ఇద్దరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలపై వేటు
పడిన విషయం తెలిసిందే. అందులో
రాయదుర్గం ఒకటి. రాయదుర్గం నుంటి
కాపు రామచంద్రా రెడ్డి నిన్నటి వరకు ప్రాతినిథ్యం వహించారు.
అయితే రానున్న ఉప ఎన్నికలలో జగన్
పార్టీ తరఫున పోటీ చేసేందుకు
కాపు సంసిద్ధంగా లేరు.
నియోజకవర్గంలో
తనపై ఉన్న వ్యతిరేకత తదితర
కారణాల వల్ల ఆయన పోటీకి
వెనుకడుగు వేస్తున్నారని అంటున్నారు. అయితే ఆయన స్థానంలో
ఓ బిసి నేతను రంగంలోకి
దింపేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్కు, కర్నాటక
మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి
సత్సంబంధాలు ఉన్నాయనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే.
కాపు సిద్ధంగా లేరు కాబట్టి రాయదుర్గంలో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున మరో బలమైన
అభ్యర్థిని దింపే యోచనలో గాలి
ముఖ్య అనుచరుడైన శ్రీరాములు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.
రాయదుర్గంలో
అభ్యర్థి వ్యవహారం శ్రీరాములు నడిపిస్తున్నారని అన్నారు. ఇప్పటికే కర్నాటకలో కొత్తగా స్థాపించిన బిఎస్సార్ మంచి ఊపుమీద ఉంది.
అదే ఊపుతో పక్కనే ఉన్న
అనంతలోనూ పట్టున్న మంచి బిసి అభ్యర్థిని
రంగంలోకి దింపి జగన్కు
అండగా నిలబడి రాయదుర్గంలో భారీ మెజార్టీతో జగన్కు విజయం సాధించి
పెట్టాలని ఆలోచించినట్లుగా వార్తలు వచ్చాయి. శ్రీరాములు బోయ కులానికి చెందిన
వారు.
అనంతలో
బోయ కులం ఓట్లు చాలా
ఉన్నాయి. దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని
చూశారని అన్నారు. కాగా శ్రీరాములు ఇటీవలే
భారతీయ జనతా పార్టీని వదిలి
బిఎస్సార్ పేరిట సొంత కుంపటి
పెట్టుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత
అక్కడి నుండే పోటీ చేసి
భారీ మెజార్టీతో గెలుపొందారు. బిజెపి అభ్యర్థి డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది.
0 comments:
Post a Comment