రాజమౌళి
తాజా చిత్రం ‘ఈగ’ ఆడియో విడుదల అయిన
దగ్గరనుంచి దాని రిలీజ్ డేట్
ఎప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న
సంగతి తెలిసిందే. సమ్మర్ లో ఈగ సంచలనం
క్రియేట్ చేస్తుందని సమ్మర్ పెద్ద సినిమాలకు పోటీ
ఇస్తుందంటున్న నేఫధ్యంలో ఈ చిత్రం విడుదల
వాయిదా పడుతూ వచ్చింది. అయితే
ఈ చిత్రం విడుదల తేదీని చివరకు ఫిక్స్ చేసారు దర్శక,నిర్మాతలు. మే
30 నే ఈగ ధియోటర్స్ లో
ఎగరబోతోందని అఫీషయల్ గా తెలియచేసారు. నాని,
సమంత, సుదీప్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ
చిత్రం భారీ బడ్జెట్ తో
రూపొంది తమిళ, తెలుగు భాషల్లో
ఒకేసారి విడుదల అవుతోంది.
ఇక ఈగ చిత్రాన్ని చిత్రం
కథ గురించి రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ... చీమ - ఏనుగూ మధ్య
గొడవ జరిగితే ఎవరు గెలుస్తారు? దోమతో
సింహం ఫైటింగుకి దిగితే ఏం జరుగుతుంది? రెండు
ప్రశ్నలకూ ఒకటే సమాధానం. అల్పప్రాణులపై
బలవంతులదే రాజ్యం. అయితే ఈ అహంకారం,
అతి విశ్వాసం అప్పుడప్పుడూ చేటు తీసుకొస్తుంది. ఆ
కథ తాబేలు, కుందేలూ పరుగుపందెంలా ఉంటుంది. ఇక్కడ కూడా ఓ
'ఈగ' మనిషిపై పోటీకి దిగింది. మరి గెలిచిందా? లేదా?
ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'ఈగ' సినిమా చూడాల్సిందే.
'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం
ఈ కథ.
అలాగని
ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించడం లేదు. దానికేం అద్భుత
శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే
ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్
ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశాం.
తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు. గలోని ప్రతీషాట్ ని
తెలుగు, తమిళ భాషల్లో సెరపేట్
గా చిత్రీకరించారు. నాన్ ఈ ఆనే
చిత్రం తమళ డబ్బింగ్ వెర్షన్
కాదు. అది బైలిగ్వల్.ఇక
కన్నడ, హిందీలలో ఈ చిత్రాన్ని డబ్బింగ్
చేసి విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రం
విజువల్ ఎఫెక్ట్స్ అద్బుతంగా వస్తున్నాయని వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ
చిత్రం కోసం దాదాపు ఐదు
కోట్ల రూపాయలు ఇప్పటివరకూ గ్రాఫిక్స్ కోసం ఖర్చుపెట్టారని విశ్వసనీయ
సమాచారం.
మొత్తం
బడ్జెట్ ముప్పై రెండు కోట్ల వరకూ
అయిందని చెప్తున్నారు.తెలుగులో గ్రాఫిక్స్ పై ఇంత ఖర్చు
ఎవరూ పెట్టలేదని చూసేవారికి విజువల్ ట్రీట్ లా ఉండాలని రాజమౌళి
ఖర్చుకు వెనకాడకుండా చేస్తున్నాడని చెప్తున్నారు. ఈ చిత్రానికి సెంధిల్
కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. అలాగే
ఈ సినిమాకి యం యం కీరవాణి
సంగీతం అందిస్తున్నారు. సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈ చిత్రాన్ని సాయి
కొర్రపాటి నిర్మిస్తున్నారు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి,
ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్, సమర్పణ: డి.సురేష్ బాబు.
0 comments:
Post a Comment