తిరుపతి:
రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి
తన దృష్టిని ప్రస్తుతం తన నూటా యాభయ్యో
సినిమాపై పెట్టినట్లుగా కనిపిస్తోంది. తిరుపతి వచ్చిన ఆయన ఉదయం మీడియాతో
మాట్లాడారు. సినిమా మాధ్యమాన్ని ప్రజలకు దగ్గరయ్యేలా ఉపయోగించుకోమని ఇటీవల రాష్ట్రానికి వచ్చిన
పరిశీలకులు వాయలార్ రవి తనతో చెప్పారని
అన్నారు. త్వరలో సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు
సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
సందేశాత్మక
కథ తీయాలని వాయలార్ చెప్పాలన్నారు. కథ సిద్ధమైతే సాధ్యమైనంత
త్వరగా తాను సినిమా తీస్తానని
చెప్పారు. సంవత్సరాలు, నెలల కొద్ది యాత్రలు
చేసే కన్నా సినిమా ద్వారా
క్యాడర్లో వీజీగా చొచ్చుకు
పోవచ్చునని చిరంజీవి చెప్పారు. రాజకీయ యాత్రల కన్నా సినిమా మాధ్యమం
ద్వారా ప్రజల్లోకి ఈజీగా వెళ్లవచ్చునని, అది
నీ చేతుల్లోనే ఉందని రవి చెప్పారన్నారు.
ప్రజలకు ఉపయోగపడే, సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే,
పార్టీ కూడా బలోపేతం అయ్యేలా
ఉండే సినిమా చేస్తానని చెప్పారు.
కాగా
చిరంజీవి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ఉదయమే ఢిల్లీ
బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ ఆయన పలువురు
ముఖ్యనేతలను కలిసే అవకాశముంది. ఈ
నెల 24వ తేదిన ఆయన
రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్టీ పెద్దలు చిరంజీవితో ఆయనకు ఇవ్వవలసిన పదవిపై
చర్చించే అవకాశముందని తెలుస్తోంది.
ఈ నెల 24న పార్లమెంటు
సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అదే
రోజు ఆయన ఎంపీగా ప్రమాణ
స్వీకారం చేస్తారు. గత సంవత్సరం డిసెంబర్
నెలలో కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు చిరు ఆదుకున్నారు. ఆ
తర్వాత ఆయన తన ప్రజారాజ్యం
పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు.
ఈ నేపథ్యంలో చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇస్తామని అధిష్టానం
హామీ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ఎంపీగా ప్రమాణ
స్వీకారం చేయనున్న చిరుకు ఏ పదవి ఇవ్వాలో
చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళుతున్నారని
అంటున్నారు.
0 comments:
Post a Comment