మెగా
ఫ్యామిలీ కలిసే ఉందని, తమలో
విభేదాలు లేవని మెగాస్టార్ చిరంజీవి
అన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన
గబ్బర్ సింగ్ ఆడియో విడుదల
కార్యక్రమంలో ఆయన ఆదివారం రాత్రి
మాట్లాడారు. రామ్ చరణ్ ఈ
కార్యక్రమానికి రాలేదని రాయవద్దని ఆయన మీడియాకు సూచించారు.
చరణ్ ఫోన్ చేసి, బాబాయ్కి విషెస్ చెప్పాలని
చెప్పాడని, ముంబైలో ఉండడం వల్లనే చరణ్
రాలేకపోయాడని ఆయన చెప్పారు. జంజీర్
సినిమా షూటింగ్ కోసం రామ్ చరణ్
ముంబైలో ఉన్నాడని ఆయన చెప్పారు. రామ్
చరణ్ రాకపోవడంపై పెడర్థాలు తీయవద్దని ఆయన చెప్పారు.
రచ్చ
ఫంక్షన్కు పవన్ కళ్యాణ్
రాకపోవడంపై తప్పుడు వార్తలు రాశారని, ఆ సమయంలో పవన్
కళ్యాణ్ ఇక్కడ లేడని, విదేశాల్లో
ఉన్నాడని, తాను అందుకు సంబంధించిన
రుజువులు చూపగలనని ఆయన అన్నారు. ఇక్కడే
ఉన్నాడంటూ ఏదో పరిశోధన చేసినట్లు
రాశారని ఆయన మీడియాకు చురకలు
వేశారు. తప్పుడు వార్తలు రాయవద్దని ఆయన సూచించారు. మెగా
ఫ్యామిలీ కలిసే ఉందని ఆయన
అన్నారు. ఈ కార్యక్రమానికి నాగబాబు,
అల్లు అర్జున్ కూడా వచ్చారు. రామ్
చరణ్ సినిమా రచ్చ ఒక్క రచ్చ
అయితే, గబ్బర్ సింగ్ రచ్చ రచ్చ
అని ఆయన అన్నారు.
మగధీర
సినిమా తర్వాత వచ్చిన ఇమేజ్ తర్వాత తనకు
నచ్చిన లవర్ బాయ్ సినిమాను
చరణ్ చేశాడని, అయితే అది అంతగా
ఆడలేదని, అప్పుడు తనకు ఏది ఇష్టమో
అది కాకుండా అభిమానులు ఏది కోరుకుంటున్నారో అది
చేయాలనే నిర్ణయానికి వచ్చాడని, దాంతోనే రచ్చ చేశాడని ఆయన
అన్నారు.
అలాగే,
పవన్ కళ్యాణ్ కూడా తనకు నచ్చిన
సినిమాలు కొన్ని చేశాడని, కానీ గబ్బర్ సింగ్
పవన్ నుంచి అభిమానులు ఏమి
కోరుకుంటున్నారో ఆ సినిమా అవుతుందని
ఆయన అన్నారు. అభిమానులు ఏం కోరుకుంటున్నారో, ఎటువంటి
సినిమాలు కోరుకుంటున్నారో అటువంటి సినిమాలు చేయడమే మంచిదని ఆయన అన్నారు. ప్రేక్షుకుల
అభిమానం పొందిన తర్వాత వారు ఏది కోరుకుంటున్నారో
అది చేయడం ధర్మమని తాను
అనుకుంటానని చిరంజీవి అన్నారు. పవణ్ కళ్యాణ్ కొత్తగా
ఉండాలని కొన్ని సినిమాలు చేశాడని, అవి బ్యాడ్ సినిమాలు
కాదని, అయితే అభిమానులు కోరుకున్న
సినిమాలు కావని, ఇప్పుడు గబ్బర్ సింగ్ పూర్తిగా అభిమానులు
పవన్ కళ్యాణ్ నుంచి కోరుకున్న సినిమా
అవుతుందని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment