న్యాయపరమైన
కారణాల వల్ల ఇదివరకు అనుకున్న
తేదీన చిత్రాన్ని విడుదల చేయలేకపోయాం. ఇప్పుడు అన్ని చిక్కులూ తొలగిపోవడంతో
విడుదల చేస్తున్నాం అన్నారు జక్కుల నాగేశ్వరరావు. ఆయన తెలుగులో లవ్
జర్ని అనే డబ్బింగ్ చిత్రం
విడుదల చేస్తున్నారు. కలర్స్ స్వాతి,షాజన్ పదమ్సీ
హీరోయిన్లుగా తమిళంలో వచ్చిన చిత్రం 'కనిమొళి'. జై హీరోగా చేసిన
ఈ చిత్రాన్ని తెలుగులో 'లవ్ జర్నీ'టైటిల్
తో రెడీ చేసి విడుదల
చేస్తున్నారు. అయితే గతంలో రిలీజ్
డేట్ ప్రకటించినా ఆ రోజున రిలీజ్
కాలేదు. స్ప్రింట్స్ టెలీఫిలిమ్స్ తిరుమలరెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రం ఈ
నెల 4న ప్రేక్షకుల ముందుకువస్తోంది.
ఈ చిత్రం గురించి జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ...ఇందుకు ఎంతగానో సహకరించిన సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, నిర్మాతల మండలి కార్యదర్శి టి.
ప్రసన్నకుమార్, మా శ్రేయోభిలాషి డేవిడ్రాజ్కూ, అలాగే
విడుదలకు సహకరిస్తున్న ఆర్.ఆర్. మూవీమేకర్స్
వెంకట్, కె. అచ్చిరెడ్డి, వి.
సురేశ్రెడ్డి గార్లకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు ఈ చిత్రం కోసం
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అన్నారు. అజిత్ 'గ్యాంబ్లర్' డైరెక్టర్ వెంకట్ప్రభు శిష్యుడు శ్రీపతి
రంగస్వామి డైరెక్ట్ చేసిన తొలి సినిమా
ఇది.
ఇక చిత్రం కథ గురించి చెపుతూ..అమ్మాయి నవ్వగానే అబ్బాయి ఎందుకు ఊహల్లోకి వెడతాడు? అదే ప్రేమని ఎందుకు
అనుకుంటాడు? అదేవిధంగా అబ్బాయి విషయంలోనూ అమ్మాయి ఎందుకు అనుకుంటుంది? తను ప్రేమించిన అమ్మాయి
వేరే అబ్బాయితో మాట్లాడుతూ కనిపిస్తే, ఆ అబ్బాయి ఎలా
ఫీలవుతాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే 'లవ్ జర్నీ'. జరగని
సంగతుల్ని జరిగినట్లూ, జరుగుతున్నట్లూ ఊహించుకొంటూ, వాటిని డైరీలో రాసుకునే ఓ యువకుని కథ
ఈ చిత్రం. ఓ డైరీ ఓ
జీవితాన్ని ఎలా మారుస్తుందో ఇందులో
కనిపిస్తుంది. హీరోగా 'జర్నీ' ఫేమ్ జై గొప్పగా
నటించారు. హీరోయిన్లుగా 'ఆరెంజ్', 'హౌస్ఫుల్2' సినిమాల్లో
నటించిన షాజన్ పదంసీ, కలర్స్
స్వాతి నటించారు. ఎలాంటి అశ్లీలతా, అసభ్యకరమైన సంభాషణలూ లేని క్లీన్ ఫిల్మ్
అని చెప్పుకొచ్చారు.
అలాగే
...చిత్రంలో క్లైమాక్స్ హైలెట్ గా ఉంటుందని చెపుతూ...ఇందులో ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా,
అందంగా ఉంటుంది. క్లైమాక్స్ సన్నివేశాలు అనూహ్యంగా ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. ఆర్. రెహమాన్ స్నేహితుడు
సతీశ్ చక్రవర్తి వినసొంపైన బాణీల్ని అందించారు. వెన్నెలకంటి, భువనచంద్ర రాసిన పాటల్ని విజయ్
యేసుదాస్, శ్వేత వంటివాళ్లు అందంగా
ఆలపించారు. ప్రతి పాటా అలరిస్తుంది.
అలాగే సినిమాకి రీరికార్డింగ్ పెద్ద ఎస్సెట్. స్ట్రయిట్
తెలుగు సినిమాలా అనిపించే రీతిలో ఏ విషయంలోనూ రాజీ
పడకుండా ఎంతో నాణ్యంగా డబ్బింగ్
పనులు నిర్వహించాం అన్నారు.
0 comments:
Post a Comment