హైదరాబాద్:
ఉప ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ
అధినేత నారా చంద్రబాబు నాయుడుకు
ఆ పార్టీ నేతలు షాక్‌ల
మీద షాక్లు ఇస్తున్నారు.
తమ్ముళ్ల వరుస వలసలతో రాష్ట్ర
రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కృష్ణా, విజయనగరం, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఈ వలసలు పాకుతున్నాయని
అంటున్నారు. ఇప్పటికే విజయనగరం చీపురుపల్లి నియోజకవర్గంకు చెందిన గద్దె బాబూ రావు
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఆ తర్వాత కృష్ణా జిల్లా నగర పార్టీ అధ్యక్షుడు
వల్లభనేని వంశీ విజయవాడలో జగన్ను కలవడం పెద్ద
దుమారం రేపింది. ఆయన ఏ క్షణంలోనైనా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. వంశీ దారిలోనే ఆయన
సన్నిహితుడు, జూనియర్ ఎన్టీఆర్కు మిత్రుడు అయిన
కొడాలి నాని కూడా వెళ్లనున్నారనే
ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొడాలి నాని ప్రస్తుతం ఎమ్మెల్యే.
ఆయన ఇప్పటికిప్పుడు కాకపోయినప్పటికీ 2014 నాటికి జగన్ పంచన చేరనున్నారనే
వాదన జిల్లాలో వినిపిస్తోంది.
కడప జిల్లాకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు మైసూరా
రెడ్డి చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారని, ఆయన ఏ క్షణంలోనైనా
జగన్ పార్టీలో చేరే అవకాశముందనే వార్తలు
కూడా వినిపించాయి. కడప ఉప ఎన్నికలలో
జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసిన సమయంలో
తనకు మరోసారి రాజ్యసభను ఇస్తానని బాబు చెప్పారని, కాని
తనకు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆయన సన్నిహితుల వద్ద
వాపోతున్నారట.
మరోవైపు
కాపు సామాజిక వర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తాజాగా మంగళవారం తెలుగుదేశం పార్టీపై తన అసంతృప్తి వ్యక్తం
చేశారు. ఆయన టిడిపికి గుడ్
బై చెప్పి వైయస్సార్ కాంగ్రెసులో చేరనున్నారని అంటున్నారు. గత కొంతకాలంగా పార్టీ
కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన మంగళవారం
కాపులకు ప్రాధాన్యత లేదంటూ బాంబు పేల్చారు.
ప్రస్తుతం
ఉన్న పదకొండు మంది రాజ్యసభ సభ్యులలో
ఒక్కరు కూడా కాపులు లేరని
ఆయన చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కాపులకు సరైన ప్రాధాన్యం ఇచ్చిందని,
ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిందని ఆయన చెబుతున్నారు. ఉప
ఎన్నికలకు ముందు పార్టీలో అసమ్మతి
గళం బాబును ఇబ్బందులకు గురి చేస్తేంది.
అసమ్మతి
గళం సాధారణమే అయినప్పటికీ తాజా అసమ్మతి గళం
కొత్త పార్టీలోకి వెళ్లేందుకు వ్యతిరేక గళం వినిపిస్తుండటం పార్టీని
తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏ
క్షణంలో ఏ నేత పార్టీని
వీడుతారో అర్థం కాని పరిస్థితి
ఉందని అంటున్నారు. ఉప ఎన్నికలకు ముందు
ఇలాంటివి పార్టీని నష్టం కలిగిస్తాయని టిడిపి
వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయట.
0 comments:
Post a Comment