తన తనయుడు రామ్ చరణ్ తేజ్ను,
తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తనకు
ఒక్కటేనని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. పవన్ కళ్యాణ్ చిరంజీవికి
దూరమవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ
వార్తలను కొట్టిపారేయడానికి చిరంజీవి ప్రాధాన్యం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నటించిన
గబ్బర్ సింగ్ ఆడియో విడుదల
కార్యక్రమంలో ఆదివారం రాత్రి ఆయన దానికే ఎక్కువ
ప్రాధాన్యం ఇచ్చారు. మీడియాపై ఆయన గుర్రుమన్నారు కూడా.
పవన్ కళ్యాణ్ తమతో కలిసే ఉన్నాడని
చెప్పడానికి ఆయన సమయం తీసుకున్నారు.
తాను
చరణ్ను కళ్యాణ్ అని
పిలుస్తానని, అయినా చరణ్ పలుకుతాడని,
అలాగే పవన్ కళ్యాణ్ను
చరణ్ అని పిలుస్తానని, అయినా
కళ్యాణ్ పలుకుతాడని, తనకు ఇద్దరు అలా
అయిపోయారని ఆయన చెప్పారు. గబ్బర్
సింగ్ ఆడియో కార్యక్రమంలో చిరంజీవి
చాలా ఆనందంగా కనిపించారు. పక్కనే కూర్చుని పవన్ కళ్యాణ్తో
ముచ్చటించారు. పవన్ కళ్యాణ్కు
ఓ వైపు చిరంజీవి, మరో
వైపు నాగబాబు కూర్చున్నారు. వారు ముగ్గురు తరుచూ
మాట్లాడుకుంటూ కనిపించారు.
తన ప్రసంగంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం
గురించి చాలా మాట్లాడాడు. కళ్యాణ్
వ్యక్తిత్వం విలక్షణమైందని ఆయన అన్నారు. కళ్యాణ్కు సమాజానికి ఏదో
చెప్పాలనే తపన ఉంటుందని, అది
మేధావులు మాత్రమే అందుకోగలుగుతారని ఆయన అన్నారు. పవన్
కళ్యాణ్ కేవలం సినిమాలు సినిమాలు
చేయడని, సమాజానికి సందేశం అందించడానికి ప్రయత్నిస్తాడని ఆయన అన్నారు.
పవన్
కళ్యాణ్ నిక్కచ్చి మనిషి అని, నిజాయితీగా
ఉంటాడని ఆయన అన్నారు. ఈవ్
టీజింగ్ అంటే కళ్యాణ్కు
మహా కోపం, తన సినిమాల్లో
మహిళలను ఎలా గౌరవించాలో చెప్పడానికి
ప్రయత్నిస్తాడని ఆయన అన్నారు. కళ్యాణ్లోని ఇన్నర్ లేయర్
మేధావులకు మాత్రమే అర్థమవుతుందని ఆయన అన్నారు. దేశభక్తి
కూడా తన సినిమాల్లో వ్యక్తమయ్యేలా
చూసుకుంటాడని ఆయన అన్నారు. కళ్యాణ్
విలక్షణమైన హీరోగా ఉండడం అందుకేనని ఆయన
అన్నారు.
0 comments:
Post a Comment