వచ్చే
సోమవారం (ఏప్రిల్ 23, 2012) రోజు దేశవ్యాప్తంగా సుమారు
4,000 లకు పైగా పెట్రోల్ పంపుల
యజమానులు సమ్మెకు దిగనున్నారు. పెట్రోల్, డీజిల్ ఇంధనాలపై తమ కమిషన్ను
పెంచాలని డిమాండ్ చేస్తూ వీరు సమ్మె చేయనున్నారు.
ప్రతి లీటరు పెట్రోల్పై
27 పైసలు, ప్రతి లీటరు డీజిల్పై 14 పైసలు చొప్పన
కమిషన్లను పెంచాలని పెట్రోల్ పంపుల యజమానులు డిమాండ్
చేస్తున్నారు.
అపూర్వ
చంద్ర కమిటీ ప్రతిపాధించిన దాని
ప్రకారం, అధిక కమిషన్లను, వాహన
టైర్లలో గాలిని నింపటం, త్రాగునీరు, టాయ్లెట్ల సౌకర్యాలను
కల్పించటం వంటి సేవలపై యూజర్
చార్జీల యొక్క లెవీ (సుంఖం)ను విధించాలంటూ చేసిన
ప్రతిపాదనను ప్రభుత్వం అమలులోకి తీసుకురావాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం
ప్రతి లీటరు పెట్రోల్పై
రూ.1.49, ప్రతి లీటరు డీజిల్పై 91 పైసలు చొప్పును
ప్రభుత్వం డీలర్ కమిషన్లను అందిస్తోంది.
ఒకవేళ ప్రభుత్వం అపూర్వ చంద్ర కమిటీ నివేదికను
అమలుపరచడానికి, కొత్త పంపులు ప్రారంభించటానికి
మార్గదర్శకాలను నిర్దేశించినట్లయితే, సమ్మెను విరమిస్తామని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా
పెట్రోల్ ట్రేడర్స్ సెక్రటరీ జనరల్ అజయ్ బన్సాల్
పేర్కొన్నారు.
0 comments:
Post a Comment