హైదరాబాద్: ప్రముఖ దర్శకడు శేఖర్ కమ్ముల తాజా సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సెప్టెంబర్ 14 విడుదలకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే ఈ చిత్రం అద్భుతాలు సృష్టిస్తోంది. తెలుగు సినిమా చరిత్రలోనే అమెరికాలో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం యూఎస్ రైట్స్ దక్కించుకున్న FICUS సంస్థ ఏకంగా 55 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.
ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ రేంజిలో అమెరికాలో విడుదల కాలేదు. శేఖర్ కమ్ముల చిత్రాలకు అమెరికాలో ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చి ఆనంద్, హ్యాపీడేస్ చిత్రాలు అమెరికా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. కొత్తవారితో రూపొందించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఇప్పటికే అన్ని ఏరియాల్లో కలిపి 18 కోట్ల బిజినెస్ చేయడం గమనార్హం.
మంగళవారం ప్రసాద్ లాబ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఈచిత్రానికి సంబంధించిన వివరాలు దర్శకుడు శేఖర్ కమ్ముల వెల్లడించారు. పసితనం అనుభవాలు, జ్ఞాపకాలు మధురంగా వుంటాయని, ఆ మధుర స్మృతులతోనే ఈ చిత్రాన్ని నిర్మించే ప్రయత్నం చేశానని, చిన్న వయసులో వస్తున్న అనేక అనుమానాలకు పెద్దయ్యాక ఎలా విడిపోయి వాటికి సమాధానాలు దొరుకుతాయనేది చిత్రంలో సరికొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నామని దర్శకుడు చెబుతున్నాడు.ఈచిత్రం యూఎస్ రైట్స్ FICUS సంస్థ ద్కించుకోగా...సాయి కొర్రపాటి సీడెడ్ ఏరియాలో, దిల్ రాజు నైజా ఏరియాలో విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం ద్వారా అక్కినేని అమల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండగా, హీరోయిన్ శ్రియ సెక్సీ లుక్‌తో ఇందులో కనిపించనుంది. కొత్త నటీనటులైన అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జార, రస్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్‌లను స్టార్ కాంటెస్ట్ ద్వారా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీజె మేయర్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: విజయ్ సి.కుమార్, ఆర్ట్: తోట తరణి, నిర్మాతలు: శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

0 comments:
Post a Comment