వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో ధీటుగా
ఎదుర్కోవాలంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని
పక్కన పెట్టాల్సిందేనన్న వి.హనుమంత రావు
తదితర పార్టీ నేతల అభిప్రాయాలతో ఆ
పార్టీ అధిష్టానం కూడా ఏకీభవించినట్లుగా కనిపిస్తోంది.
వైయస్ పైన ఇటీవల కాంగ్రెసు
పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు
పడుతున్న విషయం తెలిసిందే.
అయితే
తాజాగా కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ గవర్నర్ నరసింహన్కు వైయస్కు
వ్యతిరేకంగా లేఖ రాశాలనే అంశం
తెరపైకి వచ్చింది. కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి వైయస్ పైన విమర్శలు
చేయడం అంటే అధిష్టానం ఓకే
చెప్పినందు వల్లే అని అంటున్నారు.
ఇప్పటికే ఆయా సామాజిక వర్గాల
నేతలు వైయస్ పైన తీవ్ర
విమర్శలు చేశారు. దళితలకు వైయస్ హయాంలో ఒరిగిందేమీ
లేదని మంత్రి కొండ్రు మురళీ మోహన్, ఎంపి
జెడి శీలం వ్యాఖ్యానించారు.
అమలాపురం
ఎంపి హర్ష కుమార్ మరో
అడుగు ముందుకేసి వైయస్ హయాంలో దళితులు
జరిగిన నష్టాన్ని ఇంటింటికి ప్రచారం చేస్తామని చెప్పారు. మూడు రోజుల క్రితం
బిసి నేత, మంత్రి బస్వరాజు
సారయ్య తెలంగాణ కోసం సభ పెడతానంటే
వైయస్ తనను బెదిరించారని సంచలన
వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి.. వైయస్ చేసిన తప్పులపై
అప్పుడు తాము నోరు విప్పకుండా
తప్పు చేశామని అన్నారు.
భవిష్యత్తులో
ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని మమ్మల్ని క్షమించండని పిసిసి తీర్మానం చేసి ఆ విషయాన్ని
ప్రజలకు తెలియజేయాలని సూచించారు. 2014 ఎన్నికలకు సెమీ ఫైనల్సుగా భావిస్తున్న
ఉప ఎన్నికలలో ఎలాగైనా ఎక్కువ నియోజకవర్గాలలో గెలుపొందాలనే ఉద్దేశ్యంలో భాగంగానే కాంగ్రెసు నేతలు వైయస్ను
పక్కన పెట్టాలని భావిస్తున్నారని అంటున్నారు.
వైయస్ను పొగిడిన పక్షంలో
ఆ క్రెడిట్ అంతా వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి వెళుతున్నందున ఆయనను పక్కకు పెట్టడమే
ఉత్తమమని అధిష్టానం కూడా ఓ నిర్ణయానికి
వచ్చిందని అంటున్నారు. అందులో భాగంగానే వైయస్ పైన నేతల
వరుస విమర్శలు అని అంటున్నారు.
0 comments:
Post a Comment