నందమూరి
చిన్నోడు, యంగ్ టైగర్ జూ
ఎన్టీఆర్ ‘దమ్ము’ చిత్రం ఈ సారి టాలీవుడ్
రికార్డులన్నీ తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. అనధికారికంగా అందిన లెక్కల ప్రకారం
‘దమ్ము’
చిత్రం రిలీజ్కు ముందే రూ.
46 కోట్ల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. సినిమాపై అంచనాలు భారీ ఎత్తున్న ఉన్న
నేపథ్యంలో విడుదలైన తర్వాత దమ్ము చిత్రానికి కాసుల
వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా
కోస్తా రీజియన్లో డిస్టబ్యూటర్లంతా ‘దమ్ము’ చిత్రానికి భారీగా సొమ్ములు చెల్లించి హక్కులు దక్కించుకున్నారు. హీరోగా యంగ్ టైగర్ కావడంతో
పాటు, బోయపాటి లాంటి సూపర్ హిట్
మాస్ చిత్రాల దర్శకుడిపై నమ్మకంతోనే ఇంత పెద్దమొత్తంలో సమర్పించుకున్నారని
అంటున్నారు.
విజయవాడ
, కాకినాడ ప్రాంతాల్లో ఈ చిత్రం రైట్స్
రేటు ‘రచ్చ’ చిత్రాన్ని క్రాస్ చేసిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే
విడుదలైన ‘దమ్ము’ ఆడియో సూపర్ హిట్
కావడం కూడా సినిమాపై అంచనాలు
ఆకాశాన్ని తాకడానికి కారణం అయ్యాయి.
బోయపాటి
శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీయార్
కు జోడీగా త్రిష, కార్తీక నటించారు. సీనియర్ నిర్మాత కె.యస్. రామారావు
తనయుడు అలెగ్జాండర్ వల్లభ ఈచిత్రాన్ని నిర్మించారు.
ఈ నెల 27న ‘దమ్ము’ చిత్రం
గ్రాండ్గా విడుదల కాబోతోంది.
0 comments:
Post a Comment