యంగ్
టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన
‘దమ్ము’
చిత్రం ప్రదర్శన తొలి రోజు మచిలీపట్నంలోని
నందమూరి అభిమానులు చూసే పరిస్థితులే లేకుండా
పోయాయి. నిన్న బంద్ కారణంగా
మచిలీపట్నంలోని అన్ని థియేటర్లలో ఈచిత్రం
బెన్ ఫిట్ షో, మార్నింగ్
షోల పదర్శన నిలిపి వేశారు.
బందర్
పోర్టును వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ పొలిటికల్ పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయి.
ఆందోళనకారుల ఒత్తిడి మేరకు మచిలీపట్నంలో వ్యాపార,
వాణిజ్య కార్యకలాపాలతో పాటు సినిమా హాల్లు
కూడా మూతపడ్డాయి. దీంతో తొలిరోజు, తొలిషో
తమ అభిమాన హీరో‘దమ్ము’ చూడాలనే ఆతృతతో ఉన్న అభిమానులు ఇతర
పట్టాణాలకు తరలి వెళ్లారు. అయితే
అలా వెళ్లిన వారిలో చాలా మంది టిక్కెట్లు
దొరకక డిస్సప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది.
బోయపాటి
దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జూ
ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక
నటించారు. నిన్న విడుదలైన ఈచిత్రం
సూపర్ హిట్ టాక్తో
దూసుకెలుతోంది. ఈచిత్రంలో జూ ఎన్టీఆర్ పవర్
ఫుల్ నటనకు ఫుల్ మర్క్స్
పడ్డాయి. నందమూరి అభిమానుల అంచనాలకు తగిన విధంగా దర్శకుడు
చిత్రాన్ని తెరకెక్కించారు.
క్రియేటివ్
కమర్షియల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్
బేనర్పై కె.ఎస్.
రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ
ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఈచిత్రానికి మరింత ప్లస్ అయింది.
కోట, భానుప్రియ, సుమన్, నాజర్ తదితరులు తమ
పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు.
0 comments:
Post a Comment