విజయవాడ:
తెలుగుదేశం పార్టీతో వల్లభనేని వంశీ తెగదెంపులు చేసుకోవడానికే
మొగ్గు చూపుతారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా
మారింది. విజయవాడలో నడిరోడ్డు మీద వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని
వంశీ కలుసుకుని, ఆలింగనం చేసుకోవడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు దిగ్భ్రాంతికి గురైనట్లు పరిస్థితులు తెలియజేస్తున్నారు. వంశీకి షోకాజ్ నోటీసు జారీ చేసిన పార్టీ
ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాటలను బట్టి
అది స్పష్టంగా అర్థమవుతోంది.
పరిటాల
రవి హత్య కేసులో పాత్ర
ఉందని పార్టీ జగన్‌పై పార్టీ
ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, జగన్ అవినీతిపై పోరాటం
చేస్తున్న నేపథ్యంలో వంశీ చర్య పార్టీ
శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసిందని బుచ్చయ్య
చౌదరి అన్నారు. వంశీ ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ను
కలిశారని కూడా పార్టీ నాయకత్వం
భావిస్తున్నట్లు ఆయన మాటలను బట్టి
తెలుస్తోంది. విజయవాడ నడికూడలిలో వంశీ అలా కలవడం
సందేహాలను కలిగిస్తోందని ఆయన అన్నారు.
వారిద్దరు
కలుసుకున్నది టూ వే రోడ్డుపై
అని, టూ వే రోడ్డులో
అలా కలవకుండా ఎవరి దారిన వారు
వెళ్లే అవకాశం ఉంటుందని, కానీ వంశీ అలా
చేయలేదని, జగన్ను కలుసుకుని
ఆలింగనం చేసుకున్నారని, అందువల్ల సందేహాస్పదంగానే ఉందని ఆయన అన్నారు.
వంగవీటి రాధాకృష్ణను తెలుగుదేశం పార్టీలోకి తీసుకు రావడానికి వంశీ ప్రయత్నించిన మాట
వాస్తవమేనని, అయితే స్నేహం ఉన్నంత
మాత్రాన నడి రోడ్డు మీద
అభినందించాల్సిన అవసరం ఏమీ లేదని
ఆయన అన్నారు.
తాము
జారీ చేసిన షోకాజ్కు
ఇచ్చిన నోటీసుపై ఇచ్చే వివరణపై వంశీపై
ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే నిర్ణయం జరుగుతుందని బుచ్చయ్య చౌదరి అన్నారు. వంశీ
ఇచ్చే వివరణపై పార్టీ క్రమశిక్షణా సంఘం చర్చిస్తుందని, పార్టీ
అధ్యక్షుడు చంద్రబాబుతో చర్చించిన తర్వాత నిర్ణయం జరుగుతుందని ఆయన అన్నారు. వంశీపై
చర్యలు తీసుకునే విషయాన్ని పార్టీ మాత్రమే నిర్ణయిస్తుందని, దీనిపై ఇప్పటికిప్పుడు చెప్పలేమని ఆయన అన్నారు.
వల్లభనేని
వంశీ ముందస్తు ప్రణాళిక ప్రకారమే వైయస్ జగన్ను
కలిశారనే అభిప్రాయంతో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుగుదేశం నాయకత్వం భావిస్తున్నట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.
ఉప ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వంశీ ఉదంతం తెలుగుదేశం
పార్టీకి నష్టం చేస్తుందని భావిస్తున్నారు.
0 comments:
Post a Comment