‘‘విడుదలైన
47వ రోజుకు గానీ నా తొలి సినిమా ‘దేవదాసు’కు హిట్ టాక్ రాలేదు.
ఆ తర్వాత కొంతమంది కుర్రాళ్లు వచ్చి అభిమాన సంఘం పెడతామన్నారు. నాకు నవ్వొచ్చింది.
ఇప్పుడు తెలుస్తోంది అభిమానులంటే ఏంటో. ఇంతమంది అభిమానధనాన్ని సంపాదించుకోవడం నా అదృష్టం’’ అన్నారు
హీరో రామ్. ఆయన హీరోగా చేసిన చేసిన 'ఎందుకంటే ప్రేమంట'చిత్రం ఆడియో నిన్న(ఆదివారం)సాయింత్రం
విడుదైలైంది.
అలాగే...ఈ వేడుకలో
ఇంతకుముందు ఓ వ్యక్తి... ‘ప్రాణం ఉన్నంతవరకూ మిమ్మల్ని అభిమానిస్తాను’
అన్నాడు. ఇప్పుడు చెబుతున్నాను...
ప్రాణం ఉన్నంత వరకూ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాను. ఇది నా కెరీర్‌లోనే స్పెషల్ ఫిలిం
అన్నారు. 'ఎందుకంటే ప్రేమంట'లో తమన్నా హీరోయిన్. కరుణాకరన్ దర్శకత్వం వహించారు. స్రవంతి
రవికిశోర్ నిర్మాత. జీవీ ప్రకాష్‌కుమార్ స్వరాలు సమకూర్చారు. తొలి సీడీని రవితేజ
ఆవిష్కరించి అల్లు అరవింద్‌కి అందజేశారు. ఈ సందర్భంగా ఇలా స్పందించారు.
''కరుణాకరన్‌తో
సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకొన్నాను. కుదర్లేదు. ఎప్పటికి వీలవుతుందో చూడాలి. రామ్
నాకు మంచి మిత్రుడు. దక్షిణాదిన ఉన్న అందమైన నటుడు. ఈ చిత్రం విజయవంతం కావాలని'' ఆకాంక్షించారు
రవితేజ. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ''నాకు జీవితాన్నిచ్చింది పవన్‌కల్యాణ్. నాకు అన్నీ
ఆయనే. రామ్‌తో రూపొందించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను''
అన్నారు.
ఇక...అతిధిగా
హాజరైన దాసరి నారాయణ రావు మాట్లాడుతూ...‘ఏ విద్యార్థి అయినా.. పరీక్షల్లో మంచి మార్కులు
రావాలని కలలు కంటాడు. దానికి తగ్గట్టుగా చదివి పరీక్షలు బాగా రాస్తాడు. కానీ పరీక్షల్లో
మార్కులు తక్కువ రావడానికి ప్రయత్నించే విద్యార్థి ఎవరైనా ఉంటారా? ఆ వ్యక్తే రామ్.
మార్కులు ఎక్కువొస్తే ఎక్కడికో తీసుకెళ్లి చదివిస్తారని అప్పట్లో అతని భయం. యాక్టర్
అవ్వాలనే కోరికతో కావాలని పరీక్షలు సరిగ్గా రాసేవాడు కాదు. ఆ ఇష్టం, ఆ కసి, ఆ పట్టుదలే
రామ్‌ని ఈ రోజు స్టార్‌ని చేసింది. ప్రసుతం ఉన్న యంగ్ హీరోలందరూ మంచి ఎనర్జీ ఉన్నవాళ్లే.
వాళ్లలో రామ్ ప్రత్యేకం అన్నారు.
ఇక దర్శకుడు
కరుణాకరన్ నా చేతులతోనే తొలి అడ్వాన్స్ తీసుకున్నాడు. అప్పుడే అతనిలో క్రియేటివిటీని
చూశాను. ఈ సినిమా బాగా తీసుంటాడని నా నమ్మకం. జీవీ ప్రకాష్ వయసుకు చిన్నవాడైనా ఫ్రెష్
ట్యూన్స్ ఇచ్చాడు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి రవికిషోర్. నిబద్ధతకు గల నిర్మాత
తను. మంచి సినిమాలు తీయాలనే తాపత్రయమే ఆయన్ను అగ్ర నిర్మాతను చేసింది. నిజానికి తను
ఎక్కువగా తీసింది చిన్న సినిమాలే. రిలీజయ్యాక అవి పెద్ద సినిమాలయ్యాయి అన్నారు. అలాగే
యువ కథానాయకులంతా ఒకర్ని మించి ఒకరు పోటీపడి నటిస్తున్నారు. ఈ పోటీ బాగుంది. మన చిత్ర
పరిశ్రమలో ఇలాంటి వాతావరణం అవసరం అని చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో
...ఇంకా శ్రీయ, కాజల్, దిల్ రాజు, శ్రీనువైట్ల, బ్రహ్మానందం, బెల్లంకొండ సురేష్, బీవీఎస్‌ఎన్
ప్రసాద్, బూరుగుపల్లి శివరామకృష్ణ, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, గోపిచంద్ మలినేని తదితరులు ఈ
కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
0 comments:
Post a Comment