న్యూఢిల్లీ:
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులను లోకసభ నుండి సస్పెండ్
చేయడం ద్వారా పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం లేదనే స్పష్టమైన సంకేతాలు
ఇచ్చిందని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు ఆదివారం అన్నారు.
విభజన డిమాండ్ వినిపిస్తున్న సొంత పార్టీకి చెందిన
ఎంపీలను సస్పెండ్ చేయడం.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు కలిసొస్తుందని ఆయన
అభిప్రాయపడ్డారు.
సస్పెన్షన్
ద్వారా తెలంగాణ ఇవ్వదనే సంకేతాలు వచ్చాయని, కాబట్టి ఆ మేరకు ఉప
ఎన్నికలలో లబ్ధి పొందుతామని చెప్పారు.
ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రశ్నే కాదని, దానితో సంబంధం లేకుండా తాము గెలుపొందుతామని చెప్పారు.
ప్రభుత్వం చేపట్టిన పథకాలను సక్రమంగా అమలు చేస్తున్నామని, వాటినే
తాము ప్రచారం చేస్తామని చెప్పారు.
కాగా,
కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు తీసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రావటం లేదని ప్రస్తావించగా..
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారని
చెప్పారు. గుంటూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాలను కాంగ్రెస్
పార్టీయే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు
తెలంగాణ వ్యతిరేకి అయిన నరసింహన్ను
మళ్లీ గవర్నర్గా కొనసాగిస్తూ ఉత్తర్వులు
జారీ చేయడం కాంగ్రెసుకు తెలంగాణ
ఇవ్వాలనే ఉద్దేశ్యం లేకపోవడమేనని భారతీయ జనతా పార్టీ సీనియర్
నేత బండారు దత్తాత్రేయ హైదరబాదులో అన్నారు. ఇలా తెలంగాణను మోసం
చేస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాను విమర్శించకుండా బిజెపిని కెసిఆర్ విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు.
సోనియాను
ఎందుకు విమర్శించడం లేదో కెసిఆర్ సమాధానం
చెప్పాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తో కలిసి దత్తాత్రేయ
ఆదివారం ఇక్కడి తమ పార్టీ కార్యాలయంలో
విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నేతలను కొత్త బిచ్చగాళ్లని కెసిఆర్
అంటున్నారని, మరి, ఈ పాత
బిచ్చగాళ్లు తెలంగాణ కోసం చేసిందేమిటో చెప్పాలన్నారు.
జెఏసిని కించపరుస్తూ, బిజెపిని విమర్శిస్తూ పోతే పరకాల పోటీలో
కలిసి వస్తారని భ్రమిస్తున్నారేమో... మీ బ్లాక్మెయిల్
రాజకీయాలకు బిజెపి లొంగదన్నారు.
జెఏసిని
కించపరిస్తే సహించమన్నారు. మహబూబ్నగర్ ఎన్నికలో బిజెపి
విజయాన్ని టిఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. పరకాలలోనూ పరిస్థితి పునరావృతమవుతుందేమోనన్న బెంగతో బిజెపిని, జెఏసిని టిఆర్ఎస్ విమర్శిస్తోందని చెప్పారు. జెఏసిని కించపరిస్తే అందులో ఉన్న విద్యార్థి, ఉద్యోగ,
కుల, ప్రజా సంఘాలను అవమానపర్చినట్లేనన్నారు.
మరో 11 ఏళ్ల పాటు పోరాడుదామంటూ
కెసిఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని అంటే తెలంగాణ కోసం
ఇంకా 11 ఏళ్ల పాటు ఆగాలనా
ఆయన ఉద్దేశ్యమని ప్రశ్నించారు.
0 comments:
Post a Comment