వ్యాయామంతోపాటు..పదార్థాల ఎంపికలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. అప్పుడే శరీరంలో పేరుకొన్న అధిక కొవ్వు తగ్గుతుంది.
అదనంగా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చూడచక్కని
రూపం మన సొంతమవుతుంది. అవేంటో
చూద్దాం..
తేనె:
పంచదారతో పోలిస్తే తేనెలో కెలొరీలు అధికంగా ఉన్నా..వేడినీటితో కలిపి తీసుకోవడం వల్ల
శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. క్రమంగా బరువూ తగ్గుతాం. అలాగే
తేనె, నిమ్మరసం, దాల్చిన చెక్క...కలిపి తీసుకోవడం వల్ల
శరీర బరువులో ఎంతో తేడా ఉంటుంది.
ఊబకాయం ఉన్నవారు వంటకాల్లో బెల్లం, పంచదారకు బదులు తేనెను వాడితే
మంచిది. అందుకు గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కలిపి
పరకడుపున తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది.
గుడ్లు:
శరీరానికి అవసరైన పోషకాలే కాదు..ఇందులోని విటమిన్
బి12’ కొవ్వు కారకాలతో పోరాడుతుంది. ఫలితంగా కొవ్వు కరిగిస్తుంది.
గ్రీన్
టీ: అధికబరువు తగ్గేందుకు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకునేవారు గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి.
ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. శరీరంలో అధికకెలోరీలను తగ్గించడమే కాదు. దృడమైన ఆరోగ్యాన్నీ
అందిస్తుంది ఈ గ్రీన్ టీ.
మొలకెత్తిన
పెసలు: వీటిలో ఎ, బి, సి,
ఇ, విటమిన్లు ఖనిజ లవణాలు, క్యాల్షియం,
ఇనుము, పొటాషియం..మాంసకృత్తులు, పీచు..వంటివెన్నో పోషకాలు
లభిస్తాయి. కొవ్వును కరిగించడంతోపాటు..శరీర బరువును అదుపులో
ఉంచుతాయి. అలాగే చాలా త్వరగా
జీర్ణమవుతాయి కూడా. పైగా వీటిలో
కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది.
కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది.
అందుకే వీటిని రోజూ తీసుకోవాలి.
క్యాబేజీ:
ఉడికించిన క్యాబేజీలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది.
తరచూ క్యాబేజీ తినడం వల్ల శరీరంలో
ఫ్రీరాడికల్స్ చేరవు. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదమూ
తగ్గుతుంది. కండరాల దృఢత్వమూ పొంతమవుతుంది. రక్తాన్నీ శుద్దిచేయడం..కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడం..ఇలా శరీరానికి ఎన్నో
విధాల మేలు చేస్తుందీ క్యాబేజీ.
క్యారెట్:
క్యారెట్ శరీరంలోని చెడుకొవ్వునిల్వలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంచుతుంది.
పీచుపదార్థాన్ని అందించే ఈ కాయగూరను వారంలో
ఎక్కువసార్తు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు నేరుగా తినే
ప్రయత్నం చేయాలి.
కరివేపాకు:
కొవ్వు శాతాన్ని తగ్గించడమే కాదు..అదనంగా పేరుకోకుండా
చేసే శక్తి కరివేపాకు రెమ్మల
సొంతం. శరీరంలోని వ్యర్థాలనూ బయటకు పంపివేస్తుంది. చెడు
కొలెస్ట్రాల్ నూ కరిగిస్తుంది. అందుకే
ఊబకాయంతో బాధపడేవారు రోజు కరివేపాకును ఏదో
ఒక రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలి.
పసుపు:
వంటకాల్లో ప్రతి నిత్యం వేసే
చిటికెడు పసుపుతో కలిగే మేలు అంతా
ఇంతా కాదు. యాంటీబ్యాక్టీరియల్ సుగుణాలున్న పసుపుతో
శరీరంలో నిల్వ ఉన్న వ్యర్థ
కొవ్వు కరుగుతుంది. అదనంగా కొన్ని రకాల క్యాన్సర్ల తీవ్రతను
తగ్గించే గుణం పసుపుకే సొంతం.
కాలేయంలో చేరిన వ్యర్దపదార్థాలను వెలుపలికి
పంపించివేస్తుంది. రక్తనాళాల్లో రక్తప్రసరణ వేగవంతం అయ్యేందుకు తోడ్పడుతుంది. దాంతో గుండె ఆరోగ్యానికీ
మేలు జరుగుతుంది.
0 comments:
Post a Comment