టివిలో,
పేపర్ లో వచ్చే ప్రకటలను
చూసి వందల రూపాయలు ఖర్చుచేస్తున్నారే
తప్ప వాటివల్ల ఎంతవరకు ప్రయోజనం కలుగుతుందనేది మాత్రం ప్రశ్నగానే మిగిలి పోతోంది. అందుకే కృత్రిమంగా తయారు చేసే క్రీములపై
ఆధారపడడం కంటే సహజసిద్ధంగా తయారయ్యే
పండ్లు, నట్స్ తో కాంతివంతమైన చర్మాన్ని
పొందవచ్చు. మనం నిత్యం ఉపయోగించే
పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
కేవలం శరీరానికి శక్తి నివ్వడమే కాక
చర్మానికి మంచి కాంతి తేవడంలో
ఇవి ఎంతగానో దోహదపడుతాయి. డ్రై స్కిన్, విపరీతమైన
ఒత్తిడి... విటమిన్ల లోపం... నిద్రలేమి... అధిక పొట్ట... వివిధ
కారణాల వల్ల చిన్న వయసులోనే
చర్మంపై ముడతలు వస్తాయి. ఇవి ముఖ వర్ఛస్సును
పోగొట్టడమే కాదు... వయసుపైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. మరి ముఖంపై ముడతలను
నివారించాలంటే ఏం చేయాలో చూద్దాం...
1. రాత్రి
పడుకునే ముందు బంగాళాదుంప గుజ్జును
ముఖానికి రాయాలి. ఎండిన తరువాత చల్లటి
నీటితో ముఖాన్ని కడిగేయాలి. రెండు వారాల పాటు
రెగ్యులర్ గా చేస్తే సరి.
2. అరటి
పండు గుజ్జును ముఖానికి అప్లై చేసి అది
పూర్తిగా ఆరిన తరువాత చల్లని
నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
3. క్యారెట్
జ్యూస్ లో పాలు కలపండి.
దీనికి బాదం పలుకుల పొడిని
జత చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై
మృదువుగా మర్దనా చేయండి.
4. ప్రతి
రోజూ బాదం నూనెతో ముఖానికి
మర్దనా చేయడం వల్ల కూడా
మంచి ఫలితం ఉంటుంది.
5. కోడిగుడ్డులోని
తెల్లసొనలో నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని కళ్లకు
అంటకుండా ముఖానికి అప్లై చేయాలి. పది
నుంచి పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి. దీని వల్ల చర్మం
గట్టి పడి... ముడతలు మాయమవుతాయి.
6. బీట్
రూట్ రసం రెగ్యులర్ గా
పరిగడుపున తీసుకోవడం వల్ల కూడా యవ్వనంగా
కనిపించవచ్చు.
7. ముడతలు
ఎక్కువగా ఉంటే కొంచెం క్యాబేజీ
జ్యూస్ తీసుకుని దానికి టీ స్పూన్ తేనె
జత చేసి ముఖానికి అప్లై
చేయండి.
8. తాజా
బొప్పాయి పండు గుజ్జును తీసుకుని
ఐదు నిమిషాల పాటు ముఖానికి అప్లై
చేయండి. అలా పదిహేను నిమిషాల
పాటు ఉంచి తరువాత చల్లని
నీటితో కడిగేయండి. మంచి ఫలితం ఉంటుంది.
బొప్పాయిని తినడం వల్ల ఇంకా
మంచి ఫలితం ఉంటుంది.
9. నారింజలో
విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్
కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా,
టైట్ గా ఉంచే కొలాజిన్
ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది.
10. నట్స్:
బాదం, కర్జూరాల వంటి డ్రై ఫ్రూట్స్లో క్యాలరీలు, జింక్
అధిక శాతం ఉం టాయి.
జింక్ దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల
కలిగే రాషెస్ రాకుండా చేస్తుంది. రఫ్గా ఉండే
చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
0 comments:
Post a Comment