హైదరాబాద్/
అనంతపురం: దివంగత నేత వైయస్ రాజశేఖ
రెడ్డిని విమర్శిస్తే మంత్రులను ప్రజలు తరిమి కొడుతారని వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.
రాష్ట్ర మంత్రులను ఇటీవల ప్రజలు తరిమికొట్టడం
శాంపిల్ మాత్రమేనని ఆయన గురువారం మీడియా
ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ నెల 15వ
తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రజాపథంలో
మంత్రులను తరిమికొట్టే స్థాయి ఊపందుకుంటుందని ఆయన అన్నారు.
వైయస్
రాజశేఖరరెడ్డిని అవినీతిపరుడిగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడతారని ఆయన అన్నారు. రానున్న
ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. తమ
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
చేసిన వ్యాఖ్యలను ప్రజలు చీదరించుకుంటున్నారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ను శవంగా చేసి
రాజకీయాల్లో లబ్ధి పొందిన చరిత్ర
చంద్రబాబుదేనని ఆయన అన్నారు. వైయస్
రాజశేఖర రెడ్డి వద్ద అప్పట్లో చంద్రబాబు
పాకెట్ మనీ తీసుకున్నారని ఆయన
ఎత్తిపొడిచారు. ప్రజలు జగన్ను, వైయస్ను వేర్వేరుగా చూడడం
లేదని ఆయన అన్నారు.
దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
విషయంలో స్పష్టత తెచ్చుకోవాలని ఆయన కాంగ్రెసు నాయకులకు
హితవు చెప్పారు. భగవంతుడు దిగివచ్చినా కాంగ్రెసు పార్టీని కాపాడలేడని ఆయన అన్నారు. వైయస్
రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేయాలా, వద్దా అనే విషయంపై
కాంగ్రెసు పార్టీలో విభేదాలు చోటు చేసుకున్న విషయం
తెలిసిందే. కాంగ్రెసు నాయకులు రెండు చీలిపోయి వైయస్పై కొందరు విమర్శలు
చేస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
వైయస్
రాజశేఖర రెడ్డి ఆశయాలను సాధించేందుకే తమ పార్టీలో కార్యకర్తలు
చేరుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గుర్నాథ్ రెడ్డి అనంతపురంలో అన్నారు. దాదాపు 200 మంది వైయస్సార్ కాంగ్రెసులో
చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏనాడూ
అభివృద్ధిని పట్టించుకోని మంత్రులు, ఉప ఎన్నికలు వస్తుండడంతో
ఇష్టానుసారంగా కాంగ్రెసు కార్యకర్తలకు పనులను కేటాయిస్తున్నారని ఆయన అన్నారు.
అనంతపురం,
బళ్లారి సరిహద్దుల్లో ప్రభుత్వ పెద్దలు మైనింగ్ స్మగ్లింగ్ను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఉప ఎన్నికల్లో కోట్లు పంచేందుకు కాంగ్రెసు నాయకులు సిద్ధమవుతున్నారని ఆయన విమర్శించారు. వైయస్ను విమర్శిస్తున్నవారు దమ్ముంటే రాజీనామాలు
చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన సవాల్ విసిరారు.
0 comments:
Post a Comment