హైదరాబాద్:
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో
ప్రధాన నిందితుడు భాను కిరణ్, వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడుగా
ముద్రపడిన మంగలి కృష్ణలపై సిఐడి
పోలీసులు గురువారం మరో కేసు నమోదు
చేశారు. భాను కిరణ్, మంగలి
కృష్ణ సహా మరో ఇద్దరు
వ్యక్తులు మహబూబ్ నగర్ జిల్లాలోని తలకొండపల్లిలో
ఓ ఎన్ఆర్ఐకి చెందిన భూమిని కబ్జా చేసి బెదిరించారని
ఆరోపణలు ఉన్నాయి.
అమెరికాలో
ఉంటున్న సునీత అనే ఎన్ఆర్ఐకి
చెందిన 25 ఏకరాల భూమిని భాను
అండ్ కో కబ్జా చేశారని
ఆరోపణలు. దీనిపై సిఐడి అధికారులు అమెరికాలో
ఉంటున్న సునీతతో ఫోన్లో మాట్లాడినట్లు
సమాచారం. సుమోటోగా స్వీకరించిన సిఐడి పోలీసులు కేసు
నమోదు చేశారు. భూకబ్జా వ్యవహారంలో ఓ ప్రజాప్రతినిధి కూడా
మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో
ప్రధాన నిందితుడు భాను కిరణ్ను
పోలీసులు గతంలో అరెస్టు చేసిన
విషయం తెలిసిందే. భాను అరెస్టు తర్వాత
ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా భాను కిరణ్ అనేక
భూకబ్జాలకు, బెదిరింపులకు పాల్పడిట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
వీటన్నింటి
పైనా సిఐడి అధికారులు విచారణ
జరుపుతున్నారు. సినీ ఇండస్ట్రీలో కూడా
ప్రముఖ నిర్మాతలు శింగనమల రమేష్, సి.కల్యాణ్తో
భాను కిరణ్కు సంబంధాలు
ఉన్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. భానుతో
కలిసి వీరు కూడా కబ్జాలకు
పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటిని వారు
కొట్టి పారేస్తున్నారు.
0 comments:
Post a Comment