హైదరాబాద్:
తెలంగాణ ఏర్పడితే ఎవరూ భయపడాల్సిన అవసరం
లేదని, తమకు ఎవరిపైనా ద్వేషం
లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు
అన్నారు. తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్
జయశంకర్ సంస్మరణ సభలో ఆయన గురువారం
ప్రసంగించారు. తెలంగాణ వస్తుందేమోనని కొందరు భయం వ్యక్తం చేస్తున్నారని,
అలా భయపడాల్సిన అవసరం లేదని ఆయన
అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జయశంకర్కు నిజమైన నివాళి
అర్పిస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓ జిల్లాకు జయశంకర్
పేరు పెడుతామని ఆయన చెప్పారు. జయశంకర్
జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెడుతామని ఆయన చెప్పారు. తెలంగాణ
రాష్ట్రం త్వరలో రాబోతుందని ఆయన చెప్పారు. తెలంగాణ
వచ్చిన తర్వాత బహుజనులకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణపై
జయశంకర్ ఏ రోజు కూడా
రాజీ పడలేదని ఆయన చెప్పారు.
తెలంగాణ
ఉద్యమం విషయంలో జయశంకర్ విశ్రమించలేదని ఆయన అన్నారు. జీవిత
కాలంలో తెలంగాణ కోసం అంకిత భావంతో
పని చేయాలని అనుకున్నామని, మంచీచెడులను జయశంకర్తో చర్చించేవాళ్లమని ఆయన
అన్నారు. ఉద్యమం ఎంత గట్టిగా ఉంటే
అంత త్వరగా తెలంగాణ వస్తుందని ఆయన చెప్పారు. ఏం
చేసైనా తెలంగాణ తెచ్చుకోవాలని జయశంకర్ అంటుండేవారని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ
వచ్చే వరకు విశ్రమించబోమని ఆయన
అన్నారు. తెలంగాణ గోస చూసి జయశంకర్
దుఖ్కపడ్డారని ఆయన అన్నారు. జయశంకర్
ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి సంఘం
కార్యకర్తలు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెరాస
శాసనసభ్యుడు కెటి రామారావు హాజరయ్యారు.
0 comments:
Post a Comment