హైదరాబాద్:
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హత్యకు
కుట్ర చేస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై వైయస్సార్
కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు గురువారం శానససభ ప్రాంగణం వద్ద ధర్నా చేశారు.
వారిని పోలీసులు అరెస్టు చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు
వైయస్ జగన్ హత్యకు కుట్ర
జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సిబిఐ జాయింట్ డైరెక్టర్
(జెడి) లక్ష్మినారాయణ మొబైల్ ఫోన్ల కాల్ లిస్టును
విడుదల చేశారు.
లక్ష్మినారాయణకు
చెందిన మూడు మొబైల్ ఫోన్
నెంబర్లను ఇస్తూ వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ నాయకులు ఆ ఫోన్ల నుంచి
ఎవరెవరికి ఎన్ని ఫోన్ కాల్స్
వెళ్లాయనే విషయాన్ని బయటపెట్టారు. సిబిఐని ఉపయోగించి జగన్ను హత్య
చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెసు, తెలుగుదేశం, సిబిఐ కలిసి కుట్ర
చేస్తున్నాయని వారు ఆరోపించారు.
వాసిరెడ్డి
చంద్రబాల అనే మహిళ పాత్ర
అనుమానాస్పదంగా ఉందని వారు చెప్పారు.
ఎవరీ చంద్రబాల అని వారు అడుగుతున్నారు.
చంద్రబాల అనే మహిళతో సిబిఐ
జెడి లక్ష్మినారాయణ 328 సార్లు మాట్లాడినట్లు వారు తెలిపారు. సెల్
ఫోన్ కాల్స్ వైయస్ జగన్పై
జరుగుతున్న కుట్రను బయటపెడుతున్నాయంటూ వారు అంటున్నారు. ఎవరి
ఆదేశాల మేరకు లక్ష్మినారాయణ పనిచేస్తున్నారని
వారు అడుగుతున్నారు. ఎల్లో మీడియాతోనే (ఆంధ్రజ్యోతి,
ఈనాడు, టీవీ9) లక్ష్మినారాయణ మాట్లాడడంలోని ఆంతర్యమేమిటని వారు అడుగుతున్నారు.
చంద్రబాల
పాత్రపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
చంద్రబాల అనే మహిళ ఆంధ్రజ్యోతి
ఎబిఎన్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణతో 153 సార్లు మాట్లాడారని వారు చెబుతున్నారు. వైయస్
జగన్ ఉన్న చంచల్గుడా
జైలులో జనరేటర్ ఉన్నా తరుచుగా కరెంట్
పోవడానికి కారణమేమిటని వారు అడుగుతున్నారు. జైలులో
ప్రతి రోజూ ఎవరు కరెంట్
తీస్తున్నారని వారు అడుగుతున్నారు.
టీవీ9
ప్రతినిధితో లక్ష్మినారాయణ 386 సార్లు మాట్లాడారని వారు తెలిపారు. ఎన్టీవి
ప్రతినిధులతో లక్ష్మీనారాయణ 142 సార్లు మాట్లాడారని వారు తెలిపారు. లక్ష్మినారాయణ
ఎబిఎన్ ప్రతినిధులతో 153 సార్లు మాట్లాడారని ఆయన చెప్పారు. లక్ష్మినారాయణ
సిబిఐ కోర్టు న్యాయమూర్తి నాగమారుతి శర్మతో కూడా మాట్లాడారని వారు
చెబుతున్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా సిబిఐతో
కలిసి కుట్ర చేస్తున్నారని వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నాయకుడు గట్టు రామచంద్ర రావు
ఆరోపించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు
న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment