ఇటీవల
జరిగిన మా టీవీ సినీ
అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందజేసిన
విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సినీ
పరిశ్రమలోని పలువురు హీరోలు హాజరయ్యారు. సినీ స్టార్ల కోలాహలంతో
కన్నుల విందుగా కలర్ఫుల్గా
సాగింది.
అయితే
ఈ కార్యక్రమంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు
పరిశ్రమలో చర్చనీయాంశం అయింది. నటుడు మోహన్ బాబు
మాటీవీ అవార్డ్స్ ఆర్గనైజర్లపై అంతృప్తిగా ఉన్నారని, ఆ రోజు ఆయన
ఫంక్షన్ నుంచి అర్ధాంతరంగా వెళ్లి
పోవడానికి ఆర్గనైజర్ల అన్ ప్రొఫెషనల్ ప్రవర్తనే
కారణమనే వాదన వినిపిస్తోంది. మోహన్
బాబు అసంతృప్తికి కారణం ఏమిటా అని
ఆరా తీస్తే ఓ ఆసక్తికర విషయం
వెలుగులోకి వచ్చింది.
తన క్లోజ్ ఫ్రెండ్ అయిన రాఘవేంద్రరావుకు తన
చేతుల మీదుగానే అవార్డు ఇచ్చేలా చేయాలని మోహన్ బాబు మాటీవీ
ఆర్గనైజర్ల వద్ద మాట తీసుకున్నాడట.
అయితే ఆర్గనైజర్లు ఆయన మాట పట్టించుకోకుండా
ఆ అవార్డు ఇవ్వడానికి అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, నాగార్జున తర్వాత తనను పిలవడంతో తన
మాటకు లెక్కలేదని అవమానంగా ఫీలైన మోహన్ బాబు...
అక్కడ ఎక్కువ సేపు ఉండటం ఇష్టం
లేక మధ్యలోనే వెళ్లి పోయారని అంటున్నారు.
అయితే
మాటీవీ అవార్డ్స్ ఆర్గనైజింగ్ వర్గాల వాదన మాత్రం వేరేలా
ఉంది. తాము ప్రోటోకాల్ పాటించామని,
ఎవరినీ అవమాన పరచలేదని, మోహన్
బాబుకు వ్యక్తిగత పనులు ఉండటం వల్లనే
ఆయన ఆరోజు మధ్యలోనే వెళ్లి
పోయారు. ఆయన వెళ్లిపోయిన కారణం
తెలుసుకోకుండా తమను బ్లేమ్ చేయడం
సరికాదని అంటున్నారు.
0 comments:
Post a Comment