ఒక మంచి స్క్రిప్ట్ నమ్మి
`గమ్యం` చేశాను. మళ్ళీ అదే టీమ్తో ఈ సినిమా
చేయటం చాలా ఆనందంగా వుంది.
`ఖైదీ` సినిమా చిరంజీవి గారికి ఎలా అయితే టర్నింగ్
పాయింట్ అయిందో, ఈ సినిమా రాణాకు,
నాకూ అలాంటి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ సినిమా కథ
ఐడియా జస్ట్ రెండు నిమిషాల్లో
వచ్చింది. వెంటనే రాణాకు ఫోన్ చేసి చెప్పాను.
అతను మాత్రమే ఈ కథకు సూట్
అవుతాడు. `గమ్యం`, `వేదం`లలో గాలి
శీను, కేబుల్ రాజును చూపించిన విధంగానే ఇందులో రాణాని బీటెక్ బాబుగా చూపిస్తున్నాను. ఇది యాక్షన్ అడ్వెంచర్
మూవీ అని అన్నారు.
దగ్గుబాటి
రాణా హీరోగా, క్రిష్ దర్శకత్వంలో, సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డిలు
సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. ఈ
చిత్రంలో రాణా క్యారెక్టర్ డిఫరెంట్
గా ఉంటుందంటున్నారు దర్సకుడు క్రిష్. ఆయన ఈ విషయమై
మాట్లాడుతూ...''మనిషి డబ్బుతో పాటు
నడుస్తున్నాడో, డబ్బే మనిషిని నడిపిస్తుందో
అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నాం. మా బీటెక్ బాబు
ఎలా నడిచాడన్నది సస్పెన్స్. నొప్పింపక, తానొవ్వక నెగ్గుకొస్తుంటాడు. కథకీ, కృష్ణ తత్వానికీ
ఉన్న సంబంధం ఆసక్తికరం'' అన్నారు.
అలాగే
...తప్పు మనం చేసినా, చేతికి
మట్టి మాత్రం అంటుకోకూడదు. భుజం... భుజం రాసుకొన్నంత మాత్రాన
స్నేహం ఉన్నట్టు కాదు. ఒక్కోసారి శత్రువు
దగ్గరా స్నేహం నటించాలి. తిట్టినా పొగిడినట్టు ఉండాలి. కోత కోసినా నొప్పి
తెలియకూడదు. ఈ రోజుల్లో ఇలా
ఉంటేనే చెల్లుతుంది. ఇదే వర్తమాన సమాజంలో
చెల్లుబాటవుతున్న సిద్ధాంతం. అయితే ఆ యువకుడు
తీరు వేరు. కృష్ణుడు భగవద్గీతలో
చెప్పిన విషయాన్ని తన జీవితానికి అన్వయించుకొని
ఏం సాధించాడో తెర మీదే చూడాలి
అంటున్నారు క్రిష్.
ప్రస్తుతం
హైదరాబాద్లో మార్కెట్ నేపథ్యంగా
పతాక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాణా పేరు బాబు.
చదివింది బీటెక్. అందుకే అన్నీ హైటెక్ తెలివి
తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నాడు.
అదే అనుసరించాడు. ఈ చిత్రంలో నయనతార
హీరోయిన్ గా రాణా సరసన
చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక.
ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో
కీలకమై నడుస్తుంది.
0 comments:
Post a Comment