విజయవాడ:
ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ విజయవాడ పట్టణ అధ్యక్షుడు వంగవీటి
రాధాకృష్ణ సోమవారం కొట్టి పారేశారు. వంగవీటి రాధా కృష్ణతో తన
స్నేహం పార్టీలకు అతీతమైనదని చెప్పారు. రాజకీయాలు వేరు, స్నేహం వేరు
అని స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం పార్టీలోనే
ఉన్నానని చెప్పారు.
ఎప్పటికీ
ఆ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికావని వంగవీటికి సూచించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డితో తన కలయిక యాధృచ్చికంగా
జరిగిందని, ఇది దురదృష్టకరమన్నారు. ఈ సంఘటన
కొందరు పార్టీ నేతలను బాధించడం తనకు ఆవేదన కలిగించిందన్నారు.
పార్టీలోని
కొందరు నేతలు తనను బయటకు
పంపించాలని చూస్తున్నారని, అందుకే ఈ విషయాన్ని సైడ్
ట్రాక్ పట్టిస్తున్నారని చెప్పారు. తాను డబ్బులు సంపాదించుకుందామని
రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. తనకు విలువలు ఉన్నాయని,
వాస్తవ పరిస్థితిని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు
ఫోన్ చేసి చెప్పినట్లు తెలిపారు.
మే మూడున బాబును స్వయంగా
కలిసి వివరణ ఇస్తానని చెప్పారు.
ఆ తర్వాత ఆయన నిర్ణయం తీసుకంటారన్నారు.
కాగా ఇటీవల వంగవీటి రాధాకృష్ణ
వల్లభనేని వంశీని టిడిపి నేతలే ఇబ్బంది పెడుతున్నారని,
ఆయన తమ పార్టీలోకి రావొచ్చునని
ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment