ఈ ఫోటోలో కనిపిస్తున్న రిక్షాను చూశారా..? ఇవి మామూలు రిక్షాలు
కాదు. ఎకో-ఫ్రెండ్లీ రిక్షాలు.
పర్యావణరణ సాన్నిహిత్య ప్రణాళికలో భాగంగా, స్టార్బస్కు చెందిన
అనుబంధ కంపెనీ "గ్రీన్ వీల్స్" బ్యాటరీతో నడచే ఈ వాహనాలను
దేశ రాజధాని న్యూఢిల్లీలో విడుదల చేసింది. "జి-రిక్స్" (గ్రీన్
రిక్షా) అనే బ్రాండ్తో
గ్రీన్ వీల్స్ నగరంలో మొత్తం 25 వాహనాలను విడుదల చేసింది.
ఢిల్లీ
ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఈ
జి-రిక్స్ వాహనాలను ప్రారంభించారు. ప్రారంభంలో భాగంగా, వీటిని మాల్వియా నగర్ మెట్రో స్టేషన్,
సాకేత్లోని సెలక్ట్ సిటీ
వాక్ మాల్ మధ్యన నిర్వహిస్తున్నారు.
ఇందులో ప్రతి ప్రయాణికుడి నుంచి
కేవలం పది రూపాయలు (రూ.10)
మాత్రమే వసూలు చేస్తారు. రానున్న
కొద్ది నెల్లో వీటిని ఉత్పత్తిని మరింత వేగవంతం చేసి
నగరంలో అన్ని ప్రముఖ ప్రాంతాల్లో
అందుబాటులోకి తీసుకురావాలని గ్రీన్ వీల్స్ యోచిస్తోంది.
మరో
15 నెలల్లో 5,000 యూనిట్ల జి-రిక్షాలను పరిచయం
చేయాలని భావిస్తున్నామని, ఇందుకోసం వివిధ ప్రభుత్వ ఏజెన్సీలతో
సంప్రదింపులు జరుపుతున్నామని కంపెనీ పేర్కొంది. భారత పరిస్థితులకు సరిపోయే
విధంగా రెండేళ్లపాటు పరిశోధనలు చేసి ఈ జి-రిక్స్ను అభివృద్ధి చేశామని
కంపెనీ పేర్కొంది. వీటిని నడపటానికి పర్మిట్లు, సేఫ్ ట్రావెలింగ్
ఆప్షన్లు అవసరం లేదని,
డ్రైవర్కు ఈ వాహనాలను
ఎలా నడపాలో శిక్షణ కూడా తామే కల్పిస్తామని
కంపెనీ తెలిపింది.
0 comments:
Post a Comment