హైదరాబాద్/అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వాసిరెడ్డి పద్మ
సోమవారం సవాల్ విసిరారు. త్వరలో
రాష్ట్రంలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలో
తమ పార్టీ అభ్యర్థులు గెలిస్తే చంద్రబాబు వెంటనే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అనే ఆమె సవాల్
చేశారు. రాష్ట్రాన్ని క్షుద్ర రాజకీయాల అడ్డాగా మార్చింది చంద్రబాబేనని ఆమె మండిపడ్డారు.
జగన్
పైన విమర్శలు చేస్తుంటే వారిలో రాక్షస అంశ కనిపిస్తోందన్నారు. చంద్రబాబు ఒక
ఉన్నాదిలా మారాడనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలు నారావారి రూపంలో ఓ రాక్షసుడిని చూస్తున్నారని
నిప్పులు గక్కారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
పాలనను నిత్యం అవినీతిపాలన అంటున్న చంద్రబాబు ఏమైనా శ్రీరాముడిలా పాలించాడా
అని ప్రశ్నించారు.
తెలుగుదేశం
ప్రభుత్వం హయాంలో జరిగిన భూకేటాయింపుల్లో వాస్తవాలు రుజువైతే ఎన్ని కోట్లు జరిమానా
విధించాలని ఆమె బాబును అడిగారు.
చంద్రబాబు ఎప్పుడైనా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆస్తుల వివరాలు
బహిరంగంగా వెల్లడించారా అని ప్రశ్నించారు. బాబు
తమ పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే
ఊరుకునేది లేదన్నారు.
గడపగడపకు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి
స్పందన లభిస్తోందని అనంతపురం జిల్లాలో తాజా మాజీ ఎమ్మెల్యే
గుర్నాథ్ రెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
పథకాలను ఎలా నిర్వీర్యం చేస్తోంది
ప్రజలు గమనిస్తున్నారన్నారు.
వైయస్
రాజశేఖర రెడ్డి మరణం వెనుక కుట్ర
ఉందని ప్రజల్లో చర్చ జరుగుతోందని ఆయన
అన్నారు. కాగా ప్రభుత్వ ఆస్తులపై
ఉన్న కాంగ్రెసు జెండాలు, రంగులను తొలగించాలని గుర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన
ఎన్నికల సంఘానికి ఫ్యాక్స్ ద్వారా తాజా మాజీ ఎమ్మెల్యే
గుర్నాథ్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
మరోవైపు
తిరుపతి లీలామహల్ తన పేరుపై ఉంటే
తాను క్షమాపణలు చెప్పి ఏ శిక్షకైనా సిద్ధపడతానని
వైయస్ అవినాష్ కడప జిల్లాలో చంద్రబాబుకు
సవాల్ విసిరారు. తనది అని నిరూపించలేని
పక్షంలో చంద్రబాబు క్షమాపణళు చెప్పవలసిన అవసరం లేదన్నారు. కానీ
ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి
తీసుకుంటే చాలన్నారు.
0 comments:
Post a Comment