పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్
సింగ్’
చిత్రం ద్వారా, యంగ్ టైగర్ జూ
ఎన్టీఆర్ ‘దమ్ము’ చిత్రం ద్వారా రంగంలోకి దూకుతున్నారు. రియల్ లైఫ్లో
మంచి స్నేహితులైన ఈ ఇద్దరు దాదాపు
పది రోజుల వ్యవధితో ఒకరి
సినిమాతో మరొకరి సినిమా ఢీ కొంటున్నాయి. మరి
వీరి సినిమాల్లో ప్లస్లు, మైనస్లు ఏమిటో ఒకసారి
పరిశీలిద్దాం.
దమ్ము
:
యంగ్
టైగర్ చిత్రం కావడంతో ‘దమ్ము’ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే
విడుదలైన ఆడియోకు మంచి రెస్సాన్స్ వస్తోంది.
ట్రైలర్ కూడా పవర్ ఫుల్గా ఉండటంతో సినిమా
మంచి మాస్ ఎంటర్ టైనర్గా ఉంటుందనే టాక్
వినిపిస్తోంది. ఎన్టీఆర్ నటన, బోయపాటి దర్శకత్వం,
డైలాగ్స్ అండ్ డాన్స్ , కీరవాణి
సంగీతం ఈ చిత్రానికి ప్లస్
పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. అయితే
ట్రేడ్ పండితుల నుండి వినిపిస్తున్న వార్తల
ప్రకారం సినిమా హిట్టా ఫట్టా అనేదానికి 50-50 చాన్సెస్
ఉన్నాయంటున్నారు. మాస్ హీరో, మాస్
స్టోరీ, మాస్ డైరెక్టర్... ఇదంతా
రెగ్యులర్ మసాలానే కాబట్టి సినిమా విడుదలైతేగానీ ప్రేక్షకుల స్పందన పసిగట్టడం కష్టమే అంటున్నారు.
జూ ఎన్టీఆర్, త్రిష, కార్తీక హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా...అభినయ, వేణు తొట్టెంపూడి, భానుప్రియ,
నాజర్, కోట శ్రీనివాసరావు, సుభలేఖ
సుధాకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
కెఎస్ రామారావు సమర్పణలో అలెగ్జాడర్ వల్లభ ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు.
గబ్బర్
సింగ్ :
పవర్
స్టార్ పవన్ కళ్యాణ్‌కు
చాలా కాలంగా సరైన హిట్టు లేదు.
అయితే గబ్బర్ సింగ్ చిత్రం ఇప్పటికే
హిందీలో సూపర్ హిట్టయిన ‘దబాంగ్’ చిత్రం
కాబట్టి ఎంటర్ టైన్మెంట్కు
లోటు ఉండదు, పవర్ స్టార్కి
ఈసారి హిట్టు ఖాయం అనే వాదన
వినిపిస్తోంది. పైగా ఇప్పటికే విడుదలైన
ట్రైలర్స్ సినిమాపై మంచి అంచనాలు పెంచుతున్నాయి.
దర్శకుడు విఫలం అయితే చెప్పలేం
కానీ ఎంటైన్మెంట్ సబ్జెక్టు కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం
ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. పవన్ కళ్యాణ్, దేవిశ్రీ
ప్రసాద్ మ్యూజిక్, పంచ్ డైలాగ్స్ ఈ
సినిమాకు ప్లస్ పాయింట్స్.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్
విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం
రాజు, స్క్రీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న
సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్
కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ
: శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీన్
ప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్
0 comments:
Post a Comment