విజయనగరం:
జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది.
ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత గద్దె బాబురావు
సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఉదయం పార్టీలో
చేరారు. జగన్ పార్టీ కండువాను
కప్పి ఆయనను ఆహ్వానించారు. ముప్పై
ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో గద్దె బాబురావు కొనసాగారు.
సినీ నటుడు గిరిబాబు కూడా
జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసులో చేరారు.
కాగా
తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన
జిల్లాకు చెందిన గద్దె బాబూరావు ఇటీవల
టిడిపికి రాజీనామా చేశారు. గత బుధవారం చీపురుపల్లి
నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో బాబురావు తన రాజీనామాను ప్రకటించారు.
గద్దె బాబూరావు టిడిపిలో కీలక పదవులలో కొనసాగారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ విప్‌గా పని చేశారు.
అయితే గతంలోనూ ఆయన రెండుసార్లు పార్టీకి
రాజీనామా చేసి మళ్లీ కొనసాగారు.
2009 సాధారణ
ఎన్నికలలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై చీపురుపల్లి
నియోజకవర్గం నుండి పోటీ చేసి
ఓడిపోయారు. కాగా ఇటీవల తెలుగుదేశం
పార్టీ చీఫ్ నారా చంద్రబాబు
నాయుడు విజయనగరం జిల్లాలో చేసిన భారీ ధర్నాకు
ఆయన దూరంగా ఉన్నారు.
గద్దె
బాబూరావు విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నేత. ఆయన వైయస్సార్
కాంగ్రెసు పార్టీలో చేరితే జిల్లాలోని తెలుగుదేశం చాలా వరకు ఖాళీ
అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పలువురు నేతలు
ఆయనను రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది.
0 comments:
Post a Comment