ఒంగోలు:
ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభా నియోజకవర్గం నుంచి మాగుంట పార్వతమ్మ
కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఆమె పేరును కాంగ్రెసు నాయకత్వం దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఆమె పోటీకి మాగుంట కుటుంబసభ్యులు కూడా అనుమతించినట్లు చెబుతున్నారు.
ఉపఎన్నికల్లో పార్వతమ్మను పోటీకి దించాలని జిల్లాలోని మంత్రులు, ఎక్కువశాతం మంది శాసనసభ్యులు ప్రదేశ్
కాంగ్రెసు కమిటీ (పిసిసి)ని కోరారు.
రాష్టక్రాంగ్రెస్
వ్యవహారాల ఇన్ఛార్జీ గులాంనబీ
ఆజాద్, ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ కూడా పార్వతమ్మను పోటీలోకి
దించాలని ఒంగోలు పార్లమెంటుసభ్యుడు, ఆమె మరిది మాగుంట
శ్రీనివాసరెడ్డికి సూచించారు. మొదట ఉప ఎన్నికల్లో
పోటీకి పార్వతమ్మ అంగీకరించలేదని, రాష్ట్ర, జిల్లానాయకత్వాలనుండి తీవ్రమైన ఒత్తిడి రావటంతో పార్వతమ్మ అంగీకరించారని అంటున్నారు.
1996 సంవత్సరంలో
జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాగుంట పార్వతమ్మ పార్లమెంటు సభ్యురాలిగా గెలుపొందారు. అనంతరం 2004 సంవత్సరంలో జరిగిన కావలి అసెంబ్లీ ఎన్నికల్లో
పార్వతమ్మ శాసనసభ్యురాలిగా గెలుపొందారు. ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గంలో జరిగే ఉపఎన్నికల బరిలో
మూడోసారి ఎన్నికలబరిలో దిగనున్నారు. పార్వతమ్మ పోటీతో రాజకీయ ఉద్దండుల మధ్యపోటీ జరగనుంది.
మాజీమంత్రి
బాలినేని శ్రీనివాసరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
మాజీమంత్రి మనవడు దామచర్ల జనార్ధన్
తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు
తెలుస్తోంది. ఒంగోలు నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువుగా
ఉన్నారు. పార్వతమ్మ ఏమేరకు మహిళా ఓటర్లను ప్రభావితం
చేస్తారోనన్న విషయాలపై వేచిచూడాల్సిఉంది. తెలుగుదేశంపార్టీకి ఓటు బ్యాంకు పటిష్టంగానే
ఉండగా, కాంగ్రెస్లోని ఓటర్లను మాత్రం
ఆ రెండు పార్టీలు చీల్చుకోవాల్సిన
పరిస్ధితి నెలకొంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు చీలిపోయి తమకు
ప్రయోజనం కలుగుతుందని తెలుగుదేశం పార్టీ ఆశతో ఉంది.
0 comments:
Post a Comment