హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల
స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1944, క్రిమినల్ లా సవరణ ఆర్డినెన్స్
నిబంధనల కింద వైయస్ జగన్
ఆస్తుల స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై రాష్ట్ర
ప్రభుత్వ వర్గాలు కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)తో చర్చలు
జరిపినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల
దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది.
వైయస్
జనగ్ ఆస్తుల జప్తునకు సంబంధిత కోర్టులో దరఖాస్తు పెట్టడానికి వీలైన అనుమతిని ఇవ్వాలని
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా వైయస్ జగన్కు
చెందిన సాక్షి దినపత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్ అస్తులను
స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు
సమాచారం.
అక్రమ
మార్గంలో సంపాదించినట్లు రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం
భావిస్తే అందుకు సంబంధించిన వ్యక్తి నగదును, ఇతర ఆస్తులను జప్తు
చేయించడానికి రాష్ట్రానికి ఆ ఆర్డినెన్స్ వీలు
కల్పిస్తుందని న్యాయ నిపుణులు చెప్పినట్లు
ఆ పత్రిక రాసింది. వైయస్ రాజశేఖర రెడ్డి
అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్
జగన్ పెద్ద యెత్తున పెట్టుబడులను
ఇతర కంపెనీల నుంచి మళ్లింపజేసుకున్నారని సిబిఐ తన
చార్జీషీట్లో అభియోగం మోపింది.
కోర్టులో
విచారణ పూర్తయ్యే వరకు జగతి పబ్లికేషన్స్
ఆస్తులు తమ స్వాధీనంలో ఉండేలా
జప్తు చేయడానికి వీలు కల్పించే అనుమతిని
త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అనుమతి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన పత్రాలను సిబిఐ సిద్ధం చేస్తున్నట్లు
చెబుతున్నారు. రాష్ట్రంలోని 18 శానససభ స్థానాలకు, ఒక లోకసభ స్థానానికి
ఉప ఎన్నికలు జరిగే లోపలే ఈ
వ్యవహారాన్ని పూర్తి చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ప్రభుత్వం
నుంచి ప్రయోజనాలు పొందినవారు వైయస్ జగన్ సంస్థల్లో
1,246 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ ఆరోపించింది. జగన్
సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారికి రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించడమో, ఇతర రాయితీలు కల్పించడమో
చేసిందని సిబిఐ వాదిస్తోంది.
0 comments:
Post a Comment