హైదరాబాద్:
వచ్చే ఉప ఎన్నికల్లో అత్యధిక
స్థానాలు తమ పార్టీకి వస్తే
తెలంగాణ సమస్యను పరిష్కారిస్తామని ప్రకటన చేసిన విజయవాడ కాంగ్రెసు
పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్పై తెలంగాణ రాష్ట్ర
సమితి (తెరాస) శానససభ్యుడు హరీష్ రావు తీవ్రంగా
మండిపడ్డారు. లగడపాటి రాజగోపాల్ను ఆయన రాజకీయ
ఉన్మాదిగా అభివర్ణించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ గెలిస్తే
తెలంగాణ ఏర్పడుతుందని మంత్రి టిజి వెంకటేష్ చేసిన
వ్యాఖ్యలపై కూడా ఆయన మండిపడ్డారు.
లగడపాటి
రాజగోపాల్ వ్యాఖ్యలపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
కాంగ్రెసు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులకు తెలంగాణ కన్నా పార్టీ ముఖ్యంగా
మారిందని ఆయన అన్నారు. ఏ
మొహం పెట్టుకుని వరంగల్ జిల్లా పరకాలలో కాంగ్రెసు పార్టీ ఏ మొహం పెట్టుకుని
పోటీ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ
విషయంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు దొందూ దొందేనని ఆయన
అన్నారు.
లగడపాటి
రాజగోపాల్ మాటల్లోని మతలబు ఏమిటో చెప్పాలని
ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఉప ఎన్నికల్లో
సమైక్యవాదం గెలిస్తే తెలంగాణ రాదని లగడపాటి రాజగోపాల్
చెబుతున్నారని, సమైక్యాంధ్ర కోసం కాంగ్రెసుకు ఓటేయాలని
ప్రజలకు చెబుతున్నారని ఆయన అన్నారు. దీనిపై
కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు మౌనం వీడాలని ఆయన
డిమాండ్ చేశారు.
కాగా,
కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు రాజయ్య కూడా లగడపాటి రాజగోపాల్పై మండిపడ్డారు. దమ్ముంటే
లగడపాటి రాజగోపాల్ పరకాలలో ప్రచారం చేయాలని ఆయన సవాల్ చేశారు.
లడపాటి రాజగోపాల్ పరకాలకు వస్తే తెలంగాణవాదుల సత్తా
ఏమిటో తెలుస్తుందని ఆయన శనివారం వరంగల్లులో
అన్నారు. లగడపాటి రాజగోపాల్ హద్దులు మీరి మాట్లాడుతున్నారని ఆయన
విమర్శించారు. తెలంగాణ ఇచ్చేది తమ పార్టీ అధ్యక్షురాలు
సోనియా గాంధీ అయితే మధ్యలో
మాట్లాడడానికి రాజగోపాల్ ఎవరని ఆయన అడిగారు.
ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను
గెలిపిస్తే తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపుతామని లగడపాటి రాజగోపాల్ శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ పరిష్కారం రాష్ట్రంలోని
80 శాతం మందికి ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఉప
ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను
గెలిపిస్తే ఆగస్టు లోపల కేంద్రం సమస్యను
పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు.
0 comments:
Post a Comment