న్యూఢిల్లీ:
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో శనివారం ఉదయం భూప్రకంపనలు చోటు
చేసుకున్నాయి. శనివారం ఉదయం గం.8.53 నిమిషాల
ప్రాంతంలో భూమి కంపించింది. ఈ
ప్రకంపనలు రెక్టర్ స్కేలుపై 4.0గా నమోదయ్యాయి. ముంబై,
పూణే, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో కూడా
భూమి కంపించింది. ఏ విధమైన ప్రాణ
నష్టమూ జరగలేదని సమాచారం.
పశ్చిమ
మహారాష్ట్రలోని సతారా కేంద్రంగా భూకంపం
చోటు చేసుకుంది. ఇండోనేషియాలోని సుమత్రాలో ఇటీవల భారీ భూకంపం
వచ్చిన విషయం తెలిసిందే. సింగపూర్,
థాయ్లాండ్లో దాని
ప్రభావం కనిపించింది. ఆ సమయంలో 28 దేశాలకు
సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆ
తర్వాత సునామీ హెచ్చరికలను భారత ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
ఇండోనేషియా
భూకంపం ప్రభావం భారతదేశవ్యాప్తంగా కనిపించింది. చెన్నై, బెంగళూర్, కోల్కత్తా, పాట్నా,
తిరువనంతపురం, కొచ్చి, కటక్, భువనేశ్వర్, కోస్తాంధ్ర
ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు
తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి
బయటకు పరుగులు తేశారు.
ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీరమంతా
భూమి కంపించింది. శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తే నెల్లూరు
వరకు మాత్రమే కాకుండా తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా
భూకంపం ప్రభావం కనిపించింది. సముద్రంలో అలలు ఎగిసిపడ్డాయి. దీంతో
ప్రభుత్వం కోస్తా తీరంలో తన యంత్రాంగాన్ని అప్రమత్తం
చేసింది.
0 comments:
Post a Comment