తన పతనానికి ఓ నటుడే కారణమంటూ
వ్యభిచారం కేసులో అరెస్టయిన వర్ధమాన నటి తారా చౌదరి
ఆరోపిస్తోందట. తన భర్తను సంతోషపెట్టడానికి
తారా చౌదరిని ఓ నటి పిలిపించేదని
అంటున్నారు. ఈ విషయాన్ని తారా
చౌదరి పోలీసులకు చెప్పినట్లు ఓ ఆంగ్లదినపత్రిక రాసింది.
పోలీసులకు తారా చౌదరి ఇచ్చిన
వాంగ్మూలం కాపీ తమ ఉందని
టైమ్స్ ఇండియా చెప్పుకుంటూ ఆ విషయాలు రాసింది.
అతను కూడా నటుడేనట. తారా
చౌదరిని తన తీసుకురావాలని ఆ
నటుడు తన భార్యను విపరీతంగా
కొట్టేవాడని తారా చౌదరి చెప్పినట్లు
ఆ పత్రిక రాసింది.
టైమ్స్
ఆఫ్ ఇండియా కథనం ప్రకారం - సినిమాల్లో
తనకు చాన్స్ ఇప్పిస్తానని అతను తారా చౌదరికి
హామీ కూడా ఇచ్చాడట. అలా
చాలా రోజులు తనను వాడుకున్నట్లు ఆమె
చెప్పింది. ఈ చేదు అనుభవంతోనే
తారా చౌదరి కృష్ణానగర్లో
బ్రోతల్ ప్రారంభించింది. పూర్తి కాలం వ్యభిచారానికి దిగింది.
ఉద్యోగాలు
ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు ఎరవేస్తూ వ్యభిచారంలోకి తాను దింపుతూ వచ్చినట్లు
తారా చౌదరి పోలీసులకు చెప్పింది.
వివిధ రాష్ట్రాల్లోని బ్రోతల్ హౌస్లతో తారా
చౌదరి సంబంధాలు ఏర్పరుచుకున్నట్లు తారా చౌదరి డైరీ
ద్వారా పోలీసులు కనుక్కున్నారు. అలా చెన్నైలోని శ్రవణ్,
ముంబైలోని సుజేన్ సప్నలతో ఆమె సంబంధాలు పెట్టుకున్నట్లు
పోలీసులు కనుక్కున్నారు.
గుట్కా
వ్యాపారి జయంత్, హనీఫ్ ఆమెకు ముఖ్య
అనుచరులు. తారా అమ్మాయిలను జయంత్
గెస్ట్ హౌస్కు పంపుతూ
ఉండేది. అక్కడికి విఐపిలు వస్తుండేవారు. అమ్మాయిలతో మగవాళ్లు రాసలీలలు నడుపుతున్నప్పుడు వాటిని రికార్డు చేయడానికి హనీఫ్ పనిచేశాడు. హనీఫ్
ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తన అరెస్టుకు ముందు
ముంబైలోని ఈ వివాహానికి హాజరు
కావడానికి హనీఫ్ వెళ్లినట్లు తారా
చౌదరి చెప్పింది.
తాను
పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పోలీసు అధికారులతో జరిపిన సంభాషణలను రికార్డు చేసినట్లు తారా చౌదరి అంగీకరించింది.
అయితే, వారి పేర్లను తారా
చౌదరి వెల్లడించలేదని తెలుస్తోంది.
0 comments:
Post a Comment