చెన్నై:
ఇండోనేషియా భూకంపం ప్రభావంతో చోటు చేసుకున్న ప్రకంపనల
వల్ల తమిళనాడు రాజధాని చెన్నైలో సెల్ ఫోన్ సేవలు
దెబ్బ తిన్నాయి. మొబైల్ ఫోన్లు పని చేయడానికి మొరాయిస్తున్నాయి.
రెండో సారి చెన్నైలో భూమి
కంపించింది. కాగా ఇండోనేషియాలో బుధవారం
భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం రెక్టర్
స్కేలుపై 8.7గా నమోదైంది. దీంతో
28 దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దాని
ప్రభావంతో భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు
చోటు చేసుకున్నాయి. భారతదేశంలోని గౌహతి, చెన్నై, కోల్కత్తా, బెంగళూర్,
విజయవాడ, విశాఖపట్నం వంటి పలు ప్రాంతాల్లో
భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
భూప్రకంపనల
నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
అండమాన్, నికోబార్ దీవులకు ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇండోనేషియాలోనే
సుమత్రా తీరంలో భూకంపం చోటు చేసుకుంది. హిందూ
మహాసముద్రంలోని అండమాన్ నికోబార్ దీవులకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ రెడ్ హై - లెవల్
వార్నింగ్ జారీ చేసింది. తమిళనాడులోని
పలు ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటు
చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, మణిపూర్ల్లో కూడా ఇండోనేషియా
భూకంపం ప్రభావం కనిపించింది.
ఇండోనేషియాలో
ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన
సమాచారం ఏదీ ఇప్పటి వరకు
అందలేదు. హిందూ మహాసముద్రం మొత్తంగా
సునామీ హెచ్చరికల ప్రభావం ఉండవచ్చునని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. సింగపూర్, థాయ్లాండ్ వంటి
ప్రాంతాల్లో కూడా దాని ప్రభావం
కనిపించింది.
భువనేశ్వర్లో ప్రజలు ఇళ్లు
వదిలి బయటకు పరుగులు తీశారు.
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ తీరంలో
సముద్రం కొంత ముందుకు వచ్చినట్లు
సమాచారం అందుతోంది. దేశవ్యాప్తంగా దీని ప్రభావం కనిపించినట్లు
అర్థమవుతోంది. ఇండోనేషియా నుంచి ఇంకా సమాచారం
అందాల్సి ఉంది.
0 comments:
Post a Comment